తూప్రాన్ మున్సిపాలిటీ 16వ వార్డులో ప్రజాపాలన గ్రామసభ

పేదల కుటుంబాల్లో వెలుగులు నింపేందుకే ప్రజాపాలన గ్రామసభలు

– పారదర్శకంగా గ్యారెంటీ పథకాలు అందిస్తాం
వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ.

మెదక్ తూప్రాన్ జనవరి 6 ప్రాజబలం న్యూస్ :-

కొత్త ప్రభుత్వం సరికొత్తగా ప్రవేశపెట్టిన గ్యారంటీ పథకాలు పేదల కుటుంబాల్లో వెలుగులు నింపుతాయని, వారి స్థితిగతులు మారేందుకు దోహదపడతాయని తేలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీలో 16 వార్డులో కౌన్సిలర్ నారాయణ గుప్తా సమక్షంలో ఆర్డీవో జయచంద్ర రెడ్డి ,పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పల్లెర్ల
రవీందర్ గుప్తా ఆధ్వర్యంలో ప్రజలకోసం ఏర్పాటుచేసిన గ్రామసభ, ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో అయన పాల్గొన్నారు. ప్రజలనుంచి దరఖాస్తులు స్వీకరించి అధికారులకు అందజేశారు. ఈ సందర్బంగా ఏర్పాటైన సభలో మంత్రి దామోదర్ రాజనర్సింహ , కౌన్సిలర్ నారాయణ గుప్తా మాట్లాడుతూ ప్రతి దరఖాస్తు విలువైదని, ఎంతో ఆశతో ప్రజలు చేసిన ధరఖాస్తులని నిర్లక్ష్యం చేయకుండా డేటాబేసులో నమోదు చేయాలనీ సూచించారు. లబ్ధిదారుల ఎంపిక విషయంలో ఎలాంటి వివక్షత ఉండబోదని, పధకాల పంపిణి పారదర్శకంగా ఉంటుందని స్పష్టం చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా గ్రామసభలు ఉత్సహపూరిత వాతావరణంలో జరుగుతున్నాయని, స్వీకరణ కార్యక్రమం తుదిదశకు చేరుకుందని అన్నారు. సభలను విజయవంతంగా నిర్వహించిన అధికార యంత్రంగానికి, సహకరించిన స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు అభినందనలు తెలిపారు. అనివార్యపరిస్థితిలో దరఖాస్తు చేసుకేలేని పేదలకు తొలివిడతలో అవకాశం ఇచ్చేవిధంగా ప్రభుత్వాన్ని కోరనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, న్యాయవాదులు ఆవుల రాజిరెడ్డి, జిల్లా కలెక్టర్ కలెక్టర్ రాజర్షి షా, రమేష్, ఆర్డిఓ జయచంద్ర రెడ్డి , తాసిల్దార్ విజయలక్ష్మి, మున్సిపాలిటీ కమిషనర్
ఖాజా మోహినోద్దిన్, డీఎస్సీ యాదగిరి రెడ్డి, సీఐ శ్రీధర్, ఎస్సై శివానందం, మున్సిపాలిటీ చైర్మన్ రవీందర్ గౌడ్, వైస్ చైర్మన్ నంద్యాల శ్రీనివాస్, కౌన్సిలర్లు, జర్నలిస్టు గడ్డం ప్రశాంత్ కుమార్,నాయకులు భాస్కర్ రెడ్డి, రవీందర్ గుప్తా, భగవాన్ రెడ్డి, నాగరాజ్ గౌడ్, కొక్కొండ నరసింహారెడ్డి, మహేందర్ రెడ్డి, దామోదర్ రెడ్డి, బాయికాడి వెంకటేష్, శశి భూషణ్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, ఉమర్, పోతురాజు పల్లి మాణిక్యం, అనిల్ ,నర్సింలు, ప్రజా ప్రతినిధులు జిల్లా అధికారులు
తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking