ప్రజాబలం దిన పత్రిక
మెదక్ జిల్లా పాపన్నపేట్
24.09.2024
పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎంపీడీవో విష్ణువర్ధన్ అన్నారు మంగళవారం
స్వచ్ఛ తా హి సేవ కార్యక్రమంలో భాగంగా ఎంపీడీవో విష్ణువర్ధన్ ఆధ్వర్యంలో పాపన్నపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు పాటల పోటీలు వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిశుభ్రత కలిగి ఉండాలని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, రోగాలు దరిచేరవని అన్నారు . ఈ కార్యక్రమంలో పాఠశాల పోటీలలో గెలుపొందిన విజేతలకు ఆయన బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో పరమేష్ ,గ్రామ కార్యదర్శి నయీమ్ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.