18 వ డివిజన్ వాటర్ వర్క్స్ అధికారులకు పిర్యాదు

రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 04 అక్టోబరు 2024: మణికొండ బి.ఆర్.ఎస్ పార్టీ కార్య కర్తలు సేకరించిన ప్రజాభి ప్రాయ సేకరణ ద్వారా డాలర్ హిల్స్ కాలనీ, ఖిజ్రా కాలనీ దగ్గర బూస్టర్ నిర్మించడం అట్టి బూస్టర్ ట్రాన్స్ఫార్మర్ లేదని కొద్దికాలం తరువాత సాంకేతిక కారణాల వల్ల వినియోగంలో లేదనీ అట్టి విషయమై వాటర్ వర్క్స్ 18 వ డివిజన్ జనరల్ మానేజర్ ఆఫీసులో వ్రాత పూర్వక పిర్యాదు బి.ఆర్.ఎస్ మణికొండ మున్సిపాలిటీ అధ్యక్షుడు సీతారాం ధూళిపాళ ఆద్వర్యంలో కార్య నిర్వాహక అధ్యక్షుడు కుంభగాళ్ల ధనరాజ్, మహిళా అధ్యక్షురాలు రూపా రెడ్డి, మహమ్మద్ కలీం, షేక్ ఆరిఫ్, సంగం శ్రీకాంత్, యలాల కిరణ్, జైరాం, టైగర్ రేఖ, అశ్వక్ అలీ, ఈదులకంటి మహేష్, కృపాకర్ మొదలగు వారందరు కలసి ఇవ్వడం జరిగినది.

Leave A Reply

Your email address will not be published.

Breaking