వరద బాధితులకి ప్రభుత్వం ప్రకటించిన తక్షణ ఆర్థిక సహాయం 16,500 అందరికీ వేయాలి సిపిఎం రాష్ట్ర నాయకులు ఎర్ర శ్రీకాంత్ డిమాండ్

 

ఖమ్మం ప్రతినిధి అక్టోబర్ 4 (ప్రజాబలం) ఖమ్మంలో మున్నేరు వరద ముంపున గురైన బాధితులకు ప్రభుత్వం ప్రకటించిన 16,500 వెంటనే వారి బ్యాంక్ ఖాతాలలో జమ చేయాలి అని సిపిఎం రాష్ట్ర నాయకులు ఎర్ర శ్రీకాంత్ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈరోజు సిపిఎం ఖమ్మం 3 టౌన్ కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం నగర మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షునిగా సిపిఎం ఖమ్మం 3 టౌన్ కార్యదర్శి భూక్య శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర నాయకులు ఎర్ర శ్రీకాంత్ మాట్లాడుతూ ఆగస్టు 31 వ తారీఖున వచ్చిన వర్షాలకు మున్నేరు వరద ఉప్పొంగి 3 టౌన్ ప్రాంతంలో వెంకటేశ్వర నగర్ బొక్కలగడ్డ మోతి నగర్ పెద్దమ్మ తల్లి గుడి పంపింగ్వేల్ రోడ్డు సుందరయ్య నగర్ ఈ ప్రాంతాలన్నీ కూడా వరద ముంపుల గురై ఇంట్లో సామాన్లు మొత్తం టీవీ ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ బట్టలు చదువుకునే పిల్లల పుస్తకాలు ఇంటి డాక్యుమెంట్స్ పిల్లల సర్టిఫికెట్లు అన్నీ కూడా వరద ముంపనకు గురై పనికిరాకుండా పోయినాయి. కావున రాష్ట్ర ప్రభుత్వం అధికారులు పెట్టి అరాకొర సర్వేలు చేసి చాలామంది నిర్వాసితులకు బాధితులకు నష్టపరిహారాన్ని అందించడంలో అధికారులు విఫలమయ్యారు. కావున ఈరోజు సిపిఎం ఖమ్మం 3 టౌన్ కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం నగర మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ వినతి పత్రంలో బాధితులకు 16,500 తో పాటు వరదలలో నష్టపోయిన ఆస్తి నష్టానికి 3 లక్షల రూపాయలు ఇవ్వాలని ఆ వినతిపత్రంలో కోరడం జరిగింది. దానికి స్పందించిన మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య గారు మరల ఏదైతే వర్ధముంపును గురైన ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలకు అధికారులను పంపించి సర్వే చేయించడం జరుగుతుందని మీరు కోరిన డిమాండ్ ఏదైతే ఉందో అది ప్రభుత్వానికి తెలియపరుస్తానని ఆయన సానుకూలంగా సమాధానం చెప్పారు. ఈ కార్యక్రమంలో సిపిఎం ఖమ్మం జిల్లా నాయకులు ఎర్ర శ్రీనివాసరావు, మెరుగు సత్యనారాయణ, సిపిఎం ఖమ్మం 35వ డివిజన్ కార్పొరేటర్ ఎల్లంపల్లి వెంకట్రావు, సిపిఎం ఖమ్మం త్రీ టౌన్ కార్యదర్శి వర్గ సభ్యులు వజేనేపల్లి శ్రీనివాసరావు, షేక్ హి, శీలం వీరబాబు,నాయిని నరసింహారావు, సారంగి పాపారావు, వేల్పుల నాగేశ్వరరావు, గబ్బెటి పుల్లయ్య, సిద్ధల రాజు, షేక్ అమీనా, హెచ్ పీరయ్య, తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking