ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మార్చి 23 : జిల్లాలోని జరుగుతున్న పదవ తరగతి వార్షిక పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థిని విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండ పూర్తిస్థాయి ఏర్పాట్లు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఆర్.బి.హెచ్.వి.పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ పరీక్ష గదులు.సి.సి,టీ.వి, రూమ్స్ పరీక్ష కేంద్రం పరిసరాలను పరిష్కరించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…ఏప్రిల్ 2 వ తేదీ వరకు జరుగనున్న 10 వ తరగతి వార్షిక పరీక్షలకు హాజరై విద్యార్థినీ విద్యార్థులకు కొరకు అన్ని సదుపాయాలు కల్పించడం జరిగిందని,పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. జిల్లాలో వార్షిక పరీక్షల నిర్వహణ కొరకు 52 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసి ముఖ్య పర్యవేక్షకులు, డిపార్ట్మెంట్ అధికారులు, సంరక్షకులు (కస్టోడియన్లు), ఇన్విజిలేటర్లను నియమించడం జరిగిందని, పరీక్షలలో ఎలాంటి మాస్ కాపీయింగ్ తావు లేకుండా అధికారులు పరీక్షించాలని, ఆదేశించారు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నిబంధన మేరకు పరీక్ష కేంద్రాల వద్ద పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేసి 144 సెక్షన్ అమలు చేయడంతో పాటు సమీపంలోని జిరాక్స్ సెంటర్లను మూసి ఉంచడం జరుగుతుందని తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్ష కేంద్రాల్లో త్రాగునీరు మూత్రశాలలు,పారిశుద్ధ్యం, నిరంతర విద్యుత్ సరఫరా సౌకర్యాలు కల్పించడంతోపాటు అత్యవసర సేవల నిమిత్తం వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచడం జరుగుతుందని తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో నికి మొబైల్స్ ఎలక్ట్రానిక్స్ పరికరాలు అనుమతించడం జరగదని తెలిపారు.ఈ కార్యక్రమంలో పరీక్ష కేంద్రం నిర్వాహకులు సమంత శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.