గడ్డం వంశీ కృష్ణ కి ‘పెద్దపల్లి’ఎంపీ స్థానం కేటాయించడం హర్షనీయం

మాలమహానాడు మండల ప్రధాన కార్యదర్శి బైరం లింగన్న

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మార్చి 23 : పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా గడ్డం వంశీకీ కేటాయించడం చాలా అభినందనీయమని మాలమహానాడు మండల ప్రధాన కార్యదర్శి బైరం లింగన్న పేర్కొన్నారు. శనివారం పట్టణంలోని అంబేద్కర్ విజ్ఞాన మందిరంలో సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ…కాకా కుటుంబం నుండి మూడో ప్రజా సేవకు రావడం చాలా సంతోషించ దగ్గ విషయమన్నారు.వంశీకీ టికెట్ రావడానికి కృషి చేసిన మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నా మన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు దమ్మ నారాయణ,మాలం చిన్నయ్య, వేముల ప్రేమ్ సాగర్,అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షుడు ముల్కల రామదాస్, లింగంపల్లి వెంకటేష్, బైరం రవి,తోగరు రాజు,ఆసాది చిన్నయ్య,పేండం సత్తయ్య, కుచనపెళ్లి రాములు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking