అవును మనం టి.బి. నిర్మూలించగలం

 

ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మార్చి 23:
ప్రతి ఏటా 24 మార్చి న నిర్వహించే ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం, ఈ సంవత్సరం ఆదివారం రావటంతో
ఈరోజు 23/03/2024,
డాక్టర్ టి. రఘునాథ్ స్వామి,
జిల్లా వైద్య & ఆరోగ్యశాఖ అధికారి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, డా.రాంకుమార్,
జిల్లా వైద్య & ఆరోగ్యశాఖ అధికారి, కూకట్పల్లి జోన్(జిఎచ్ఎమ్సి)
ఎచ్ఎమ్టి హిల్స్ కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం 2024 వేడుకలు లో పాల్గొన్నారు.

తొలుత ర్యాలీలో జిల్లా అధికారులు సిబ్బంది తో కలసి పాల్గొన్నారు.

తదుపరి ప్రపంచవ్యాప్త మహమ్మారి క్షయ పై అవగాహన సదస్సు లో ప్రసంగిస్తూ…..,

1882లో డాక్టర్. రాబర్ట్ కోచ్
క్షయకి కారణమయ్యే బాక్టీరియాను కనుగొన్నట్లు పురస్కరించుకుని
ప్రతి సంవత్సరం ప్రపంచ టీబీ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు,
ఈ వ్యాధికి వ్యతిరేకంగా చేసిన పోరాటంలో ఇది ఒక ప్రధాన పురోగతి & ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం 2023 యొక్క థీమ్ YES WE CAN END TB
అని జిల్లా వైద్య అధికారి చెప్పారు!

ప్రపంచవ్యాప్తంగా రోజుకు 3500 మరణాలు సంభవిస్తున్నాయని,
రోగనిర్ధారణ చేయని ప్రతి కేసు సంవత్సరానికి 10-15 మంది వ్యక్తులకు సోకే అవకాశం ఉందని,
క్షయవ్యాధిని ఎదుర్కోవడానికి జిల్లా యంత్రాంగం సమర్థవంతమైన చర్యలను అమలు చేస్తున్నారని,
1-2 వారాల పాటు నిరంతర దగ్గు ఉన్న వ్యక్తులను ఉచిత పరీక్ష చేయించుకోవడానికి మరియు
ఉచిత చికిత్స / పోషకాహార కిట్‌ల సదుపాయంతో పాటు,
DBT ప్రక్రియ పోషకాహార ప్రయోజనాల కోసం ₹500 వరకు రోగుల భారాన్ని తగ్గించేందుకు ప్రతి Anms మరియు Asha లు ప్రోత్సహించాలి తెలిపారు,

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో సవాళ్లతో కూడుకున్న పరిస్థితుల్లో, ప్రతిఒక్క సిబ్బంది ఎడతెగని కృషి మమ్మల్ని రాష్ట్రంలో అగ్రస్థానానికి చేర్చింది. ANMలు మరియు ASHAలు పోషించిన పాత్రలు క్షయవ్యాధి నిర్మూలనలో వారి ప్రాముఖ్యతను అని జిల్లా వైద్య అధికారి గుర్తు చేశారు .
TBకి వ్యతిరేకంగా పోరాటంలో ఇప్పటికీ ఉన్న సవాళ్లను తెలుపుతూ 2025 నాటికి వ్యాధిని అంతం చేయడానికి అవగాహన మరియు చర్యను ప్రోత్సహించడానికి ఈ రోజును ఒక అవకాశంగా ఉపయోగించుకోవాలని తెలిపారు,

అనంతరం జిల్లా అధికారులు
టీబీ రోగులకు పౌష్టికాహార కిట్‌లను పంపిణీ చేసి, ప్రభుత్వం నేరుగా లబ్ధిదారులకు ఆర్థిక ప్రయోజనాలను అందజేస్తోందని, దీని కోసం వారు పౌష్టికాహారం తినేందుకు ఉపయోగించుకోవచ్చని,
క్షయని అంతమొందించేందుకు కృషి చేస్తామని సిబ్బందికి ప్రతిజ్ఞ చేయించారు.

యి కార్యక్రమంలో
డా నారాయణ రావు,
డిప్యూటీ డిస్ట్రిక్ట్ మెడికల్ & హెల్త్ ఆఫీసర్ కీసర డివిజన్ ,
డాక్టర్ ఆనంద్ , డిప్యూటీ డిస్ట్రిక్ట్ మెడికల్ & హెల్త్ ఆఫీసర్ మల్కాజిగిరి డివిజన్ ,
డా సంధ్య రాణి
జిల్లా టీబీ ప్రొగ్రమ్మె అధికారి,
డా సరస్వతి,
జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి
డా పద్మావతి,
టిడి మినీ హబ్స్ జిల్లా ప్రోగ్రామ్ అధికారిణి
డాక్టర్ మనుపప్పన్ ,వైద్య అధికారి ,
యు.పి.ఎచ్.సి ఎల్లమ్మబండ ,
డా మమత,
పి.ఎచ్.సి బాలానగర్
డా తీతసి,
వైద్యాధికారిణి,
యూ.పి.ఎచ్.సి జగద్గిరిగుట్ట
డా సౌమ్య,
యూ.పి.ఎచ్.సి కూకట్పల్లి
మోహన్, శ్రవణ్ , మధురవాణి,
శశి, రామ కృష్ణ టీబీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking