ఎరువుల డీలర్లకు శిక్షణ కార్యక్రమం పూర్తి.

 

జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్

ప్రజాబలం -మెదక్ జిల్లా నియోజకవర్గం
13.09.2024:

జాతీయ వ్యవసాయ విస్తరణ యాజమాన్య సంస్థ హైదరాబాద్ మరియు వ్యవసాయ శాఖ మెదక్ జిల్లా ఆధ్వర్యంలో వ్యవసాయ ఉత్పధక పంపిణీ దారుల డిప్లమో కోర్సులో భాగంగా 48 వారాలపాటు శిక్షణ తరగతులు నిర్వహించి శిక్షణలో నేర్చుకున్నటువంటి అంశాల మీద నేడు తుది పరీక్ష కృషి విఙ్ఞాన కేంద్రం తునికి కౌడిపల్లి నందు నిర్వహించడం జరిగింది .
ఈ కార్యక్రమాన్ని పరిశీలించడానికి జిల్లా వ్యవసాయ అధికారి శ్రీ గోవింద్ పాల్గొని ఈ సందర్భంగా మాట్లాడుతూ విత్తన మరియు పురుగు మందులు అమ్మేటువంటి డీలర్లు వ్యవసాయంలోని విత్తన దశ నుండి పంటకోత వరకు వివిధ దశల్లో వివిధ పంటల్లో చీడపీడ నివారణకు ఉపయోగించు పురుగు మరియు తెగుళ్ల మందుల మోతాదు తో పాటు ఏ విధంగా వాడాలో ఈ శిక్షణ కాలంలో నేర్చుకున్న అంశాలను క్షేత్రస్థాయిలో తమ షాపుల వద్దకు వచ్చేటువంటి రైతులకు తర్ఫీదు ఇచ్చే విధంగా విత్తన డీలర్లకు ఈ శిక్షణ కార్యక్రమం ఉపయోగపడుతుందని అన్నారు.


శిక్షణానంతరం సర్టిఫికెట్ జారీ చేయబడుతుందని, రైతులు మోతాదుకు మించి పురుగు మందులు ఎరువులు వాడడం వల్ల రైతుల పెట్టుబడి ఖర్చులు పెరగడంతో పాటుగా వాతావరణము నీరు కాలుష్యం అవడంతో పాటు పిచికారి చేసేటువంటి రైతుకు పలు ఆరోగ్య సమస్యలు తలెత్తున నేపథ్యంలో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నిత్యం రైతులు క్షేత్రస్థాయిలో విత్తన మరియు పురుగుమందుల కోసం డీలర్ల ను సంప్రదిస్తున్న నేపథ్యంలో పురుగుమందుల వ్యవసాయ రంగంలో వస్తున్నటువంటి వివిధ సాంకేతిక పద్ధతులను విత్తనం నుండి పంట కోత వరకు వివిధ దశల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు గూర్చి ఎరువుల డీలర్లకు 48 వారాలపాటు శిక్షణ ఇచ్చి వారికి పరీక్ష నిర్వహించి సర్టిఫికెట్ అందజేయడం జరుగుతుంది ఇది కేవలం ఎరువులు పురుగుమందుల డీలర్ల కే కాకుండా యువ రైతులకు కూడా సువర్ణ అవకాశం ఈ డిప్లమో కోర్సు చేసిన యువ రైతులకు సర్టిఫికెట్ పొందే అవకాశం ఉంది ఈ సర్టిఫికేట్ ఆధారంగా ఎరువులు మరియు పురుగుమందుల దుకాణాలను నెలకొల్పుకొని గ్రామస్థాయిలో ఆర్థిక అభివృద్ధి చెందే అవకాశం ఉందని తెలిపారు
ఈ కార్యక్రమంలో డాక్టర్ శిల్ప మేనేజ్ కన్సల్టెంట్, శ్రీ మతి సుధారాణి, సహాయ వ్యవసాయ సంచాలకులు ,సుమతి వ్యవసాయ అధికారి రాష్ట్ర శిక్షణ కార్యాలయం , పుణ్య వతి కౌడిపల్లి సహాయ వ్యవసాయ సంచాలకులు , మండల వ్యవసాయ అధికారులు స్వప్న, రాజ్ నారాయణ, డైసీ ఫెసిలిటేటర్లు అమరేశ్ కుమార్ ,నరేంద్ర ఎరువుల డీలర్ల లు పాల్గోన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking