పొంగులేటి శీనన్న పై ఈడి దాడులను ఖండించండి

 

డీసీసీబీ డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్

ఇల్లందు ప్రతినిధి సెప్టెంబర్ 28 (ప్రజాబలం) తెలంగాణతో పాటు బిజెపి కాకుండా ఉన్నఇతర రాష్ట్రాలలోని ప్రభుత్వాలను పడగొట్టాలని, ప్రజాస్వామ్యం ను అపహస్యం చేసి బిజెపి పార్టీ, కేంద్ర ప్రభుత్వంకుట్ర చేస్తుందని, దానిలో భాగంగా శుక్రవారం నాడు పొంగులేటి పై ఈడి దాడులు చేయడం జరిగిందని, ఈ విషయంపై ప్రజాస్వామిక వాదులు ప్రతిపక్షాలు ఖండించాలని డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ పిలుపునిచ్చారు కామేపల్లి మండలం పండితాపురం గ్రామంలో జరిగిన విలేకరుల సమావేశం లో డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లి బాబు యాదవ్ మాట్లాడుతూ ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని, సహించలేని కేంద్ర ప్రభుత్వం కీలకంగా వ్యవహరిస్తూ వున్నకాంగ్రెస్ పార్టీ నేతలను భయభ్రాంతులకు గురిచేయాలని, దీని ద్వారా బిజెపి పార్టీ లబ్ధి పొంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తుందని ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో, ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న రాష్ట్ర రెవెన్యూ శాఖ మాత్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పై అనుచితంగా ఈడి దాడులను నిర్వహించడం చాలా దుర దృష్టకరమని బిఆర్ఎస్ బిజెపి పార్టీ లోపాయ కారి ఒప్పందం చేసుకుందని, చిత్తశుద్ధి ఉంటే కాళేశ్వరం పై జరిగిన అవినీతిని, ఫోన్ టాపింగ్ కేసులను, అక్రమ సంపాదన కేసులపై దాడులు చేయలేక, కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్న ఈడి వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ భానో త్ నరసింహా నాయక్, మత్స్య శాఖ అధ్యక్షులు మేకల మల్లికార్జునరావు, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు పాటిబండ్ల ప్రసాద్, ఎల్ హెచ్ పి ఎస్ మండల అధ్యక్షులు భూక్య నాగేంద్రబాబు, శీలం పుల్లయ్య,మేకల మహేష్ బాబు,మేకల లక్ష్మీనారాయణ, రాయల నాగ శంకర్, దాసరి వెంకన్న గుగులోతు కిషన్, గుండ్ల చిరంజీవి తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking