ఆపదలో మేమున్నాం లయన్స్ క్లబ్ అధ్యక్షులు డాక్టర్ బొల్లికొండ
ఖమ్మం ప్రతినిధి సెప్టెంబర్ 28 (ప్రజాబలం) ఖమ్మం విపత్కర పరిస్థితులలో వరద ముంపు బాధిత జర్నలిస్టులకు ఖమ్మం లయన్స్ క్లబ్ అండగా నిలిచింది. ఖమ్మం మున్నేరు వరద ముంపులో నిరాశ్రయులైనటువంటి బాధిత ప్రజలను ఆదుకుంటూన్నారు. అందులో భాగంగానే మున్నేరు వరద ముంపు బాధితులైనటువంటి జర్నలిస్టులకు చేయూతగా నిలిచారు. లయన్స్ క్లబ్ అధ్యక్షులు డాక్టర్ బొల్లికొండ శ్రీనివాసరావు, గతంలో ఐఎంఏ జిల్లా కమిటీతో మాట్లాడి వరద ముంపు బాధిత జర్నలిస్టులకు నిత్యావసరాలు వస్తువుల కిట్లను అందించారు శనివారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో 21 మంది బాధిత జర్నలిస్టులకు నిత్యావసరాల వస్తువులతో పాటు రెండు దుప్పట్లను అందజేశారు. స్థానిక లయన్స్ క్లబ్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జర్నలిస్టులకు తాము ఎల్లవేళలా అండగా ఉంటామన్నారు. మున్నేరు వరద ముంపు నాటినుండి నగరంలోని వరద ముంపు ప్రాంతాల ప్రజలను ఆదుకున్నామన్నారు. ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ సహకారంతో నిత్యవసర వస్తువులతో పాటు అవసరమైన వస్త్రములు దుప్పట్లను తమ పరిధిలో వారికి అందజేసి ఆపద సమయంలో తోడుగా ఉన్నామన్నారు. ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని తమ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తుందన్నారు. జర్నలిస్టులకు తాము అండగా నిలుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ కార్యదర్శి గెల్లా శ్రీనివాసరావు, కోశాధికారి ఆర్తి గోవిందరావు, లయన్స్ రీజనల్ కోఆర్డినేటర్ డిపిసి రావు, లయన్స్ క్లబ్ సభ్యులు విశ్వేశ్వరరావు ఎం దుర్గం నాగేశ్వరరావు టీ కృష్ణారెడ్డి, కవి రచయిత సీనియర్ జర్నలిస్టు కట్టెకోల చిన నరసయ్య, ప్రెస్ క్లబ్ కోశాధికారి బిక్కి గోపి వెంకట కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు
