ప్రతి రైతుకు రెండు లక్షల లోపు రుణాలను మాఫీ చేయాలని…

రంగంపేట సహకార సంఘం మహాజనసభలో. తీర్మానించారు

ప్రజాబలం కొల్చారం మండలం సెప్టెంబర్ 28

మెదక్ జిల్లా కొల్చారం మండలం రంగంపేట సహకార సంఘం అధ్యక్షులు, డీసీఎంఎస్ ఉపాధ్యక్షులు అరిగే రమేష్ అధ్యక్షతన శనివారం రంగంపేట సహకార సంఘం మహాజనసభ నిర్వహించారు ఈ సందర్భంగా సహకార సంఘం సీఈవో నవీన్ సహకార సంఘం పనితీరు నివేదిక ను సహకార సంఘం ద్వారా రైతులకు అందజేస్తున్న వివిధ రకాల రుణాల వివరాలు తెలిపారు ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు, ఎరువుల విక్రయం ద్వారా సహకార సంఘానికి వచ్చిన కమిషన్ వివరాలు తెలిపారు. ఈ సందర్భంగా రైతులు రుణాల కోసం డైరెక్టర్ల వద్దకు వెళ్లకుండా డైరెక్టర్ లను సహకార సంఘానికి పిలిపించి డాక్యుమెంట్ లపై సంతకాలు తీసుకొని రైతులకు రుణాలు అందజేయాలని రైతులు మహాజంనసభలో సహకార సంఘం పాలకవర్గానికి సూచించారు. సహకార సంఘానికి రంగంపేట గ్రామాలలో విలువైన స్థలాలు ఉన్నట్లు వాటిని కాపాడడం కోసం స్థలాల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని సహకార సంఘం డైరెక్టర్ ప్రవీణ్ రెడ్డి ఈ సందర్భంగా మహాజనసభలో ప్రతిపాదించారు.అనంతరం సహకార సంఘం అధ్యక్షులు రమేష్ మాట్లాడుతూ తమ పాలకవర్గం పదవిలోకి వచ్చిన సమయంలో సహకార సంఘం ద్వారా రుకోటి రూపాయల రుణాలు రైతులకు ఇవ్వగా ప్రస్తుతం 6 కోట్ల రుణాలు రైతులకు ఇచ్చినట్లు తెలిపారు. గతంలో అప్పుల్లో ఉన్న సహకార సంఘాన్ని అప్పులు లేకుండా లాభాల బాట పట్టించినట్లు తెలిపారు. రైతులందరికీ రెండు లక్షల లో పురాణాలు మాఫీ చేయడంతో పాటు రైతు భరోసా నిధులు పట్టా పాస్బుక్ ఉన్న ప్రతి ఒక్క రైతుకు అందజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సహకార సంఘం ఉపాధ్యక్షులు మోత్కు మల్లేశం, డైరెక్టర్లు ప్రవీణ్ రెడ్డి, దుర్గేష్ గౌడ్,జనార్దన్ గౌడ్, మాందాపురం సాయిలు, ఆకుల రమేష్,సంగమేశ్వర్ రెడ్డి, ఎలుక గంగులు, పెంటయ్య, చాకలి రమేష్, రైతు సమన్వయ సమితి మాజీ మండల శాఖ అధ్యక్షులు భూపాల్ రెడ్డి,కాంగ్రెస్ నాయకులు వెంకట్ గౌడ్, రంగంపేట రైతు సమన్వయ సమితి మాజీ అధ్యక్షులు రాజా గౌడ్, సిబ్బంది బీరప్ప, శ్రీనివాస్, సిద్దు, బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking