శ్రీ రాముని గుడి కట్ట కదిలింది రామదండు.

 

మహిమాన్వీతమైన రామాలయం పునరుద్దరణ.

విజయదశమి కల్లా రంజిల్లు రామునిగుడి.

తూప్రాన్, సెప్టెంబర్, 28.
ప్రజాబలం న్యూస్ :-

మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణానికి తూర్పు ఈశాన్యంలో మహిమాన్విత మహిమగల శ్రీ రామునిగుడి కట్టడానికి రామదండు నడుంబిగించింది. విజయ దశమి నాటికి భక్తుల దర్శనార్థం దేదీప్యమానంగా రూపుదిద్దుకుంటుంది. విష్ణుమూర్తి దశ అవతారాల విగ్రహాల తోపాటు ఆగమ శాస్త్ర ప్రకారం నిత్య నూతన ఒరవడితో ముస్తాభైతుంది. దసరా పండుగ నాడు కుటుంబ సపరివార సమేతంగా శ్రీ సీతా రాములవారిని దర్శించుకుని, ఇక్కడనే పాలపిట్ట దర్శనం గావించి పూజ చేసిన అరే చెట్టు ఆకులు (బంగారం) ఇచ్చుకొని పరస్పర దసరా శుభాకాంక్షలు తెలుపుకొని ఆలింగనం తో విజయ దశమి వేడుకలు ఘనంగా చేసుకోవాలని తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ జ్యోతి కృష్ణ, కౌన్సిలర్ రామునిగారి శ్రీశైలంగౌడ్, మున్సిపల్ పాలకవర్గం, ఆలయ కమిటీ పాలకవర్గం ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం, వాస్తు నిపుణులు సలహా మేరకు రామాలయం వద్ద ఉన్న నీటి గుండం ఈశాన్యం వైపు తరలించి నూతనంగా నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆలయ గాలి గోపురం అయోధ్య తీరులో మార్పు చేస్తున్నారు. అంతే కాకుండా ఆలయం ముందు ఉన్న మంటపం పై చుట్టూ శ్రీ రాముని దశ అవతారాల దేవుళ్ళ విగ్రహాలు ఏర్పాటు చేసి భక్తుల దర్శనం కోసం కొలువు దీరనున్నారు.
ఆలయ మహత్యం తూప్రాన్ పట్టణంలోని రాములగడ్డ పై స్వయంభువుగా వెలసిన శ్రీశ్రీశ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ సమేతంగా అయోధ్య నుండి దండకారణ్యం వెళుతూ మార్గ మధ్యంలో తూప్రాన్ పట్టణ శివారులోని రాములగడ్డ పై విశ్రాంతి తీసుకోవడానికి వచ్చాడని ప్రసిద్ధి. ఇక్కడ ఒక రాత్రి నిద్రిస్తే మానసిక రోగులకు ఉపశమనం కలుగుతుందనీ, కోరిన కోర్కెలు తీర్చే ఇలవేల్పుగా పూజలందుకుంటున్న శ్రీశ్రీశ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి గుడి కట్టి ప్రతి శ్రీరామ నవమి వేడుకలు, కళ్యాణం, తదితర ప్రత్యేక పూజలు చేస్తారు. గతంలోనే ఆలయ పునరుద్ధరణకు శ్రీకారం చుట్టినప్పటికి పాలక వర్గ నిర్లక్ష్యంగా, ఆర్థిక స్థితిగతులు సహకరించక మధ్యలోనే ఆగినప్పటికి కొత్త చైర్మన్ కొలువుదీరిన వెను వెంటనే ప్రత్యేక చొరవ తీసుకుని ఆలయ నిర్మాణం పూర్తి చేయడానికి కంకణ బద్ధులై పని చేయడం వల్ల దాదాపు నిర్మాణం పూర్తి దశకు చేరుకుంది. దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం అనేక ఏర్పాట్లు చేస్తున్నారు. రామాలయానికి దర్శనం కోసం వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కలిగిస్తామని తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నాయకులు తూప్రాన్ మున్సిపాలిటీ 15వ వార్డ్ కౌన్సిలర్ రాముని గారి శ్రీశైలం గౌడ్ మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. ఈ ఆలయము ఒక భగవంతుడు పంపించిన భక్తుని సహకారంతో చక్కగా రూపుదిద్దుకుంటుందని రాములవారి ఆలయ కమిటీ అధ్యక్షులు బజార్ రవీందర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో గడ్డం ప్రశాంత్ కుమారు, శివ, వెంకటేష్ ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking