రాహుల్ గాంధీ పై బీజేపీ తన్వవిందర్ సింగ్ మాటలను ఖండిస్తూ, ప్రధాన మంత్రి మోడీ, హోమ్ శాఖ మంత్రి అమిత్ షా,తన్వవిందర్ సింగ్ దిష్టిబొమ్మ దగ్నం
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 19 : ఏఐసీసీ,టీపీసీసీ పిలుపు మేరకు మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు,డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆదేశాల మేరకు రాహుల్ గాంధీ పై బీజేపీ నేత తన్వీవిందర్ సింగ్ బయటకు వస్తే చంపేస్తామని,మీ నానమ్మ ఇందిరా గాంధీకి పట్టిన గతి నీకు పడుతుందని బహిరంగంగా మాట్లాడిన మాటలను ఖండిస్తూ, మంచిర్యాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంచిర్యాల పట్టణంలోని బెల్లంపల్లి చౌరస్తాలో ప్రధాన మంత్రి మోడీ,హోమ్ శాఖ మంత్రి అమిత్ షా, తన్వీవిందర్ సింగ్ ల దిష్టిబొమ్మలను దగ్నం చేసిన కాంగ్రెస్ జిల్లా నాయకులు పార్టీ,లక్షెట్టిపేట దండేపల్లి,హాజపూర్, మండలం,మంచిర్యాల పట్టణ నాయకురాళ్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.