విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలను తెలిపిన పోలీసులు

రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 19 సెప్టెంబర్ 2024
సైబరాబాద్ పోలీసు ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అధికారులు వీ.రాఘవేందర్, ఏ.నవీన్ చారి, మల్లేశ్వర రావు, జి.మల్లేశ్వర్, మస్తాన్ వారి ఆద్వర్యంలో సొసైటీ ఫర్ సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్.సి.ఎస్.సి) సభ్యులు నీతా వడ్గేరే, వీర సాకేత్, అందె లక్ష్మణ్ రావు, దిలీప్ కక్కడ్ వారి తోడ్పాటుతో నార్సింగి గవర్నమెంట్ జిల్లా పరిషద్ స్కూల్ ప్రధానోపాధ్యాయుడు విజయ్ కుమార్ సహకారంతో స్కూల్ విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలను విడియో ద్వారా వివరముగా తెలియ పరుస్తూ, ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లలు వాహనాలను నడుప వద్దని, అందువలన జరిగే ప్రమాదాలకు గురి కావొద్దని, తల్లి తండ్రులకు పుత్ర శోక సంద్రంలో ముంచరాదని, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంగిన్చకుండా ముందు జాగ్రత్తగా మసులుతూ, నిర్లక్షం వలన జరిగే ప్రమాదాల గురించి తెలియ జేసి మున్ముందు జాగ్రత్తగా మసులుతూ, అవసరాన్ని బట్టి రోడ్డుపై పెద్దలకు సహాయ సహకారా లందించాలని చెప్పడంతో పాటు ట్రాఫిక్ నిబంధనలను అనుసరించి వాటిని తూచా తప్పకుండా పాటిస్తామని ప్రతిజ్ఞ చేయించడం జరిగినది.

Leave A Reply

Your email address will not be published.

Breaking