ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా.. టెట్ నిర్వహణ , సన్నద్ఢత ఏర్పాట్ల పై సోమవారం నిర్మల్ జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో, జిల్లాలోని సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్. వరుణ్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన టెట్ పరీక్ష సంబంధించి అధికారులతో మాట్లాడుతూ, సెప్టెంబర్ 15వ తేదీన జరుగు పరీక్షకు పూర్తి సన్నద్ధత ఏర్పాట్లు చేయవలసిందిగా ఆదేశించారు.పరీక్షా నిర్వహణలో పాలుపంచుకొనే పోలీసు,విద్యా, రెవెన్యూ, పౌరసంబంధాల శాఖ, జిల్లా పరిషత్,ట్రెజరీ, వైద్యశాఖ, రవాణా శాఖ,ఆర్టీసీ అధికారులకు, పరీక్ష నిర్వహణలో వారి బాధ్యతలను తెలియజేశారు.
ఈ పరీక్ష ఈ నెల 15 న జరుగుతుందని, నిర్మల్ జిల్లాలోని మొత్తం 53 కేంద్రాల్లో 12197 మంది పరీక్షకు హాజరవుతారని ఆయన తెలిపారు. సెప్టెంబర్ 15వ తేదీన ఉదయము జరుగు పరీక్షకు నిర్మల్ లో 28 సెంటర్లు, బైంసాలో నాలుగు సెంటర్లు కేటాయించామని, మధ్యాహ్నం నిర్మల్ లో 21 సెంటర్లు, బైంసాలో ఒక సెంటర్లో పరీక్ష నిర్వహించబడుతుందని ఆయన తెలిపారు.
పరీక్ష కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేయాలని, విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలవకుండా,అన్ని శాఖల వారు సమన్వయంతో పనిచేసి,పరీక్ష నిర్వహణను విజయవంతం చేయాలని ఆయన కోరారు.
ఈ సమావేశంలో. సంభందిత అధికారులూ, తదితరులు పాల్గొన్నారు.