ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మార్చి 06 : మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట లోని మున్సిపాలిటీ పరిధిలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ లో సోమవారం రోజున సైన్స్ ఫెయిర్ నిర్వహించడం జరిగింది. సుమారు 300 మంది విద్యార్థులు వివిధ రకాల సైన్స్ ఎగ్జిబిట్స్ తయారుచేసి ప్రదర్శన నిర్వహించడం జరిగింది. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పాల్గొని విద్యార్థులు చేసినటువంటి సైన్స్ ఆవిష్కరణలను ని చూసి అభినందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ చిందం చంద్రశేఖర్ మాట్లాడుతూ… ఇటువంటి కార్యక్రమాల వల్ల విద్యార్థులకు సైన్స్ పట్ల అవగాహన పెరుగుతుంది. విద్యార్థులు చాలా రకాల నూతన ఆవిష్కరణలను తయారు చేయడం జరిగింది.మంచి ప్రదర్శన ఇచ్చినటువంటి విద్యార్థులకు బహుమతులు కూడా అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో కృష్ణవేణి టాలెంట్ స్కూల్ గౌరవాధ్యక్షులు రమేష్ చంద్ జైన్ పాఠశాల కరస్పాండెంట్ అక్కల శ్రీనివాస్,డైరెక్టర్లు పెట్టం తిరుపతి, ఎంబడి రమేష్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.