పోలీసు ఉత్తమ సేవా పతకానికి ఎంపికైన ఏసీపీ సారంగపాణికి శుభాభినందనలు తెలిపిన మున్నూరుకాపులు
విధి నిర్వహణలో చురుకుగా పని చేస్తున్న,ప్రతిభ కనబర్చిన పోలీసులను రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ సేవా పతకాలకు ఎంపిక చేసింది.ఈ సేవా పతకానికి ఖమ్మం ట్రాఫిక్ ఏసీపీ సాధుల సారంగపాణి ఎంపికయ్యారు.ఆయన ఎంపిక పట్ల మున్నూరుకాపు సంఘం ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తూ శుభాభినందనలు తెలిపారు.సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుల గాంధీ, కార్యదర్శి శెట్టి రంగారావు, జిల్లా అధ్యక్షులు పారా నాగేశ్వరరావు, జర్నలిస్టుల సంఘం జిల్లా అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణ, మున్నూరుకాపు సంఘం ప్రముఖులు పొదిల రవికుమార్, కొత్త సీతారాములు,పసుపులేటి దేవేందర్, కనిశెట్టి నర్సయ్య, మాడూరి పూర్ణ, కల్లూరి సోమనాథం, తాళ్లూరి హన్మంతరావు,ఆళ్ల కృష్ణ,మారిశెట్టి వెంకటేశ్వరరావు,పగడాల మంజుల, మాధురి మధు,కేదాసు నర్సయ్య,కూరాకుల గోపీ,మాటేటి రవి, ఉండేలా గంగాధర్, సముద్రాల శ్రీను,ఇమ్మిడిశెట్టి సంపత్, పసుపులేటి లక్ష్మీ,శ్రీదేవి తదితరులు సారంగపాణికి శుభాభినందనలు చెప్పారు.