ప్రజా పాలన గ్రామసభలలో పాల్గొన్న ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్

ఖమ్మం ప్రతినిధి జనవరి 02 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం సాతాని గూడెం, ముచ్చర్ల ఊట్కూరు తాళ్ల గూడెం గ్రామాలలో జరిగిన ప్రజా పాలన గ్రామ సభలలో ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ పాల్గొన్నారు. దరఖాస్తులను జాగ్రత్తగా పరిశీలించి, ప్రజలను ఎక్కువసేపు నిరీక్షించకుండా, అసంపూర్తిగా ఉన్న దరఖాస్తులను అధికారులే స్వయంగా పూర్తిచేయాలని, వెంటనే వారికి రసీదు ఇవ్వాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా కోరం కనకయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా తెలంగాణప్రజల ఆకాంక్షల మేరకు అధికారం చేపట్టిన కేవలం నెల రోజులలోపే దరఖాస్తుల ప్రక్రియ చేపట్టిందని, దరఖాస్తులు పరిశీలించిన తర్వాత పథకాల అమలు జరుగుతుందని, ఈనెల 6వ తారీకునే కాకుండా మిగతా రోజులలో కూడా దరఖాస్తులను తీసుకునే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుందని అన్నారు. పేదరికం అనేది లేకుండా చేయడమే ఇందిరమ్మ రాజ్యం లక్ష్యమని, పేర్కొన్నారు. మల్లి బాబు యాదవ్ మాట్లాడుతూ ఇది దొరల తెలంగాణ కాదని ప్రజల తెలంగాణ అని, సామాజిక తెలంగాణ లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ఇచ్చిందని, ప్రజలందరి కోరిక మేరకు మేనిఫెస్టోలో 6 గ్యారంటీల పథకాలను ప్రకటించిందని, ప్రతి ఒక్కరికి పథకాలు అమలు అయ్యేలా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కామేపల్లి మండల అధికారులు, ఎమ్మార్వో ఎండిఓ, ఏ ఈ ఓ మరియు అనధికారులు, ప్రజాప్రతినిధులు, జిల్లా కాంగ్రెస్ నాయకులు sk పతే మహమ్మద్, ఏపూరి మహేందర్,జగన్నాథ రెడ్డి, దమ్మాలపాటి సత్యం, సరిరాం నాయక్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు గింజల నర్సిరెడ్డి, సత్తి వీరబాబు సిరిపురపు రవి, గుజ్జర్లపూడి రాంబాబు, గోపిరెడ్డి, ఊట్కూరు ఎంపీటీసీ హేమలత, మాజీ సర్పంచ్ బానోతు నరసింహ నాయక్, బొడ్డు లక్ష్మీనారాయణ, కేసర నరసింహారెడ్డి కేసర పురుషోత్తం రెడ్డి, దుద్దుకూరు నాగేశ్వరరావు సండ్ర వెంకటేశ్వర్లు ,సూర నాగేశ్వరరావు పుచ్చకాయల వీరభద్రం, తోటకూరిశివయ్య పుచ్చకాయల సత్యనారాయణ,రాయల లక్ష్మయ్య, రాయల రామకృష్ణ, దాసరి శ్రీను మేకపోతుల మహేష్, కోల వెంకటేశ్వర్లు మరియు దరఖాస్తుదారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking