ప్రజా పాలన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి తుమ్మల

ఖమ్మం ప్రతినిధి జనవరి 02 (ప్రజాబలం) ఖమ్మం కార్పొరేషన్ స్థానిక 27,28 డివిజన్లలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమంలో ఖమ్మం ఎమ్మెల్యే రాష్ట్ర వ్యవసాయ,చేనేత, మార్కెటింగ్ శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ ప్రజా పాలన కార్యక్రమాన్ని ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని అన్నారు,ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన ఆరు గ్యారంటీ పథకాల ప్రయోజనాలను ప్రజలకు అందించడంలో అధికారులు,ప్రజా ప్రతినిదులు పూర్తి పారదర్శకంగా వ్యవహరించాలని,పథకాల అమలులో ఏటువంటి అవకతవకలకు తావు లేకుండా చూడాలని నిరుపేదలకు,అర్హులకు ప్రాధాన్యం ఇవ్వాలనీ మున్సిపల్ కమీషనర్ ఆదర్శ్ సురభికి మంత్రి సూచించారు ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు ప్రభుత్వం వచ్చిన కొన్ని రోజుల్లోనే రెండు ప్రధానమైన స్కీం లను అమలుచేశామని, మిగతా వాటిని కూడా అమలు చేయడానికి ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నారన్నారనీ,ప్రజలు ఈనెల 6 వరకు అయా డివిజన్లలో,పంచాయతీ కార్యాలయాల్లో దరఖాస్తులు సమర్పించుకోవాలని, సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి పేదవారికి అందుతాయ ని ఇందులో ఎలాంటి అపోహలకు పెట్టుకోవద్దనీ అన్నారు,ఇందిరమ్మ ఇండ్ల కోసం చేసుకున్న దరఖాస్తుల్లో నిలువ నీడలేని పేదలను ఎంపిక చేయాలనీ అధికారులకు ఆదేశించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి,కార్పొరేటర్లు దొడ్డా నగేష్,గజ్జెల లక్ష్మి వెంకన్న, కమర్తపు మురళి,మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ,జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గా ప్రసాద్,సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావేద్,సాధు రమేష్ రెడ్డి తదితర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking