నిర్మల్ జిల్లాలో మంజులపూర్, కడ్తల్, గంజల్, రాంనగర్ లలో అభయహస్తం దరఖాస్తులను పరిశీలించిన జిల్లా పాలనాధికారి ఆశిష్ సాంగ్వాన్

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..

ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ లో భాగంగా మంగళవారం వివిధ వార్డులలో, గ్రామాలలో పర్యటించి దరఖాస్తుల స్వీకరణ, ఏర్పాట్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా పాలనాధికారి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అభయహస్తం కార్యక్రమంలో ఆరు గ్యారంటీలను అమలు పరచడానికి అర్హులైన ప్రజల నుండి దరఖాస్తుల స్వీకరణ లో ఎలాంటి అలసత్వం వహించకుండా, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తగు జాగ్రత్తలతో దరఖాస్తుల స్వీకరణ ను విజయవంతం చేయాలని అన్నారు.
ఇంకా నాలుగు రోజుల వరకు కొనసాగుతుందని అర్హులైన వారు తప్పక దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు.
గ్రామాలలో, వార్డులలో ఏర్పాటు చేసిన దరఖాస్తుల స్వికరణలో అన్ని సదుపాయాలు కల్పించాలని, త్రాగునీరు, కుర్చీలు, కౌంటర్ల వారిగా ఆన్ని సౌకర్యాలు కల్పించాలని ఆన్నారు.
అనంతరం ఆయా కేంద్రాలలో దరఖాస్తుల స్వీకరిస్తున్న ప్రక్రియను స్వయంగా పరిశీలించి దరఖాస్తు దారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వీకరించాలని, ప్రతి కేంద్రంలో హెల్ప్ డెస్క్ లు ,ఏర్పాటు చేయడం జరిగిందని ప్రజలు ఎలాంటి సందేహాలు ఉన్న తెలుసుకోవచ్చని, ప్రతి కేంద్రంలో దరఖాస్తు ఫారాలు సిద్ధంగా అందుబాటులో ఉన్నాయన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking