క్రైస్తవుల సంక్షేమానికి కాంగ్రెస్ సర్కార్ కృషి ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి డిసెంబర్ 25 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేటలోని క్రైస్తవుల సంక్షేమానికి కాంగ్రెస్ సర్కార్ నిరంతరం కృషి చేస్తుందని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు పేర్కొన్నారు.సోమవారం అయన క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని పట్టణంలోని పలు చర్చిలతో పాటు సీఎస్ఐ చర్చ్ లో క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపారు. ముందుగా ఫాస్టర్ డేవిడ్ ఎమ్మెల్యేకు ప్రత్యేక ఆశీర్వచనం ఇచ్చారు. అనంతరం భక్తులను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ…ఏసుప్రభువు బోధనలు శాంతి, ప్రేమ, సౌభ్రాతృత్వం, సహనం, ఎప్పటికి అనుసరణీయమన్నారు. మన రాష్ట్రంలో సెక్యులర్ ప్రభుత్వం ఏర్పడిందన్నారు. మత సామరస్యాన్ని కాపాడుకుంటూ, పరిపాలన పారదర్శకంగా, ప్రజాస్వామికంగా సాగుతుందన్నారు.క్రిస్టియన్ సోదరులు సంతోషంతో, ఆనందోత్సహాలతో క్రిస్మస్‌ను జరుపుకోవాలని ఆకాక్షించారు.క్రీస్తు అనుసరించిన మార్గాన్ని అనుసరించి సమాజ అభివృద్ధికై అందరు పాటుపడాలని పేర్కొన్నారు. క్రీస్తు బోధనలు ఆచరనీయం, అనుసరణీయమని తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు చింత అశోక్ కుమార్, మునిసిపల్ ఫ్లోర్ లీడర్ చెల్ల నాగభూషణం,కౌన్సిలర్ లావుడ్యా సురేష్ నాయక్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ఎండి ఆరీప్,మండల అధ్యక్షుడు,పింగళి రమేష్,యూత్ అధ్యక్షుడు రందేని వెంకటేష్,ఎంపీపీ అన్నం చిన్నన్న మంగ,వైఎస్ ఎంపీపీ దేవేందర్ రెడ్డి, కాంగ్రెస్ యూత్ మండల అధ్యక్షుడు అంకతి శ్రీనివాస్, కొ ఆప్షన్స్ సయ్యద్ అలీ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నలిమెళి రాజు,మడిపెళ్లి స్వామి,కాంగ్రెస్ నాయకులు నవాబు ఖాన్,గుత్తికొండ శ్రీధర్,అంకతి కిషన్, గోపె రమేష్,బోప్పు సతీష్, రమేష్,రాజు,ముక్రంజా, రాజలింగు,విలియమ్స్, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking