గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందించిన టిఆర్ఎస్ నేతలు
ప్రజాబలం చెన్నూరు నియోజకవర్గ రిపోర్టర్ జనవరి 30 :
బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం మందమర్రి పట్టణంలోనీ పాత బస్టాండ్ ఏరియాలోని శివాలయం గుడి దగ్గర ఉన్న మహాత్మ గాంధీ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు 420 హామీలు ఇచ్చి 420 రోజులు దాటిన హామీలు నెరవేర్చడంలో విఫలమైనారని వినతి పత్రం సమర్పించి నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో మందమర్రి పట్టణ బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, టీబిజికేఎస్ యూనియన్, ఏరియా, సెంట్రల్ ,నాయకులు, వార్డు అధ్యక్షులు, యూత్, విద్యార్థి, సోషల్ మీడియా, నాయకులు మహిళా నాయకురాలు పాల్గొన్నారు.