ఉద్యోగుల సంక్షేమానికి యాజమాన్యం అధిక ప్రాధాన్యతనిస్తుంది

మందమర్రి ఏరియా జిఎం జి. దేవేందర్

ప్రజాబలం చెన్నూరు నియోజకవర్గ రిపోర్టర్ జనవరి 30 :

సింగరేణి యాజమాన్యం ఉత్పత్తి ఉత్పాదకతో పాటు కార్మికుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతిస్తుందని మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ జి.దేవేందర్ అన్నారు. గురువారం జిఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఆయన అధ్యక్షతన గుర్తింపు సంఘం (ఏ‌.ఐ‌.టి‌.యు.సి) యూనియన్ తో 3 వ స్ట్రక్చర్ మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గుర్తింపు కార్మిక సంఘం (ఏ‌.ఐ‌.టి‌.యు.సి) మందమర్రి బ్రాంచ్ సెక్రటరీ సలేంద్ర సత్యనారాయణ, బెల్లంపల్లి బ్రాంచ్ సెక్రటరీ దాగం మల్లేష్, రామకృష్ణాపూర్ బ్రాంచ్ సెక్రటరీ అక్బర్ అలీ, మరియు ఏఐటి యుసి నాయకులతో నిర్మాణత్మకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో కాసిపేట-2 ఇంక్లైన్ లో ఫ్యాన్ ఆపరేటర్ మరియు మేగజైన్ రూం నిర్మాణం, మ్యాగజైన్ రూమ్ కి కంప్యూటర్, కాసిపేట-1 ఇంక్లైన్ కి సంబంధించి స్కావెంజర్ పోస్టింగ్, కాసిపేట-1&2 కి సంబంధించి ఓపెన్ రెస్ట్ హాల్ నిర్మించాలని నిర్ణయించారు. కె.కె.ఒ.సి కి సంబంధించి ఫర్నిచర్ మరియు లాకర్ సౌకర్యం కల్పించాలని, సోమగూడెంలోని భరత్ కాలనీలో కొత్త డ్రైనేజీ పైప్ లైన్ మరియు వాటర్ పైప్ లైన్, సరిపడా స్ట్రీట్ లైట్లను కల్పించాలని కోరారు. రామకృష్ణాపూర్ స్టేషన్ రోడ్ లో గల కమ్యూనిటీ హాల్ లో కుకింగ్ మరియు డైనింగ్ హాల్ నిర్మాణం చేపట్టాలని కోరారు. ఈ సందర్భంగా జి.ఎం జి.దేవేందర్ మాట్లాడుతూ గుర్తింపు సంఘం నాయకులు ప్రస్తావించిన పనులను పరిష్కరించవలసిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇప్పటి వరకు ఏవిధముగా ఉత్పత్తి లక్ష్య సాధనలో సహకరించారో ఇక ముందు కూడా సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో ఎస్.ఓ.టు జి.ఎం విజయ ప్రసాద్, మందమర్రి ఏఐటియుసి బ్రాంచ్ సెక్రటరీ సలేంద్ర సత్యనారాయణ, ఏరియ సేఫ్టీ ఆఫీసర్ రవీందర్, ఏరియా ఇంజనీర్ వెంకటరమణ (ఇ అండ్ ఎం), కే.కే ఓ.సి ప్రాజెక్ట్ ఆఫీసర్ మల్లయ్య, కే.కే గ్రూప్ ఏజెంట్ రామదాసు, డీ.జీ.ఎం. ఐ.ఇ.డి రాజన్న, పర్సనల్ మేనేజర్ ఎస్.శ్యాంసుందర్, సురేష్ (డి.వై.జి.ఎం, ఇ&ఎం), డి.వై పి.ఎం మైత్రేయ బందు, కృష్ణారెడ్డి (ఎస్.ఇ, ఇ&ఎం), సివిల్ ఎస్.ఈ రాము, ఏరియా సీనియర్ సెక్యూరిటీ ఆఫీసర్ రవి, బెల్లంపల్లి ఏఐటియుసి బ్రాంచ్ సెక్రటరీ దాగం మల్లేష్, రామకృష్ణాపూర్ బ్రాంచ్ సెక్రటరీ అక్బర్ అలీ, సుదర్శన్ (స్ట్రక్చర్ కమిటీ మెంబర్), సి.వి.రమణ (స్ట్రక్చర్ కమిటీ మెంబర్) పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking