మూడు నెలల్లో 30 వేల నియామకాలు
ఇది నిఖార్సయిన ఇంద్రమ్మ రాజ్యం
మెదక్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మొహమ్మద్ హఫీజ్
మెదక్ కాంగ్రెస్ అంటేనే నిరుద్యోగ యువతకు కొలువులు ఇచ్చే ప్రభుత్వముగా రికార్డు సృష్టించిందని మెదక్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మొహమ్మద్ హఫీజ్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన గురువారం నాడు విలేకరులతో మాట్లాడుతూ దేశ చరిత్రలో ఎక్కడా లేనివిధంగా మూడు నెలల వ్యవధిలో 30 వేల ఉద్యోగాలు నిరుద్యోగులకు కల్పించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందని ఆయన వెల్లడించారు. ఇచ్చిన మాట ప్రకారం కొలువుల జాతర చేస్తున్నామని పేర్కొన్నారు. గత ప్రభుత్వం పదేళ్లపాటు అధికారంలో ఉండి నిరుద్యోగులను తీవ్ర అన్యాయానికి గురిచేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో మరిన్ని ఉద్యోగాలు ఇచ్చే కార్యచరణతో తమ ప్రభుత్వం ముందుకు పోతుందన్నారు. ఉద్యోగ నియామకలతో సమాజంలో మహిళలు అనగారిన వర్గాలకు న్యాయం జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. చదువుకున్న యువతకు గుర్తింపు ఇచ్చే పథకాలను ప్రోత్సహించామన్నారు. నిఖార్సైన న ఇంద్రమ్మ రాజ్యం అంటే తమదేనని ఆయన వెల్లడించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు మేకల రవి, అశోక్ రెడ్డి, నాగిరెడ్డి ఉన్నారు.