కార్ ఇన్ ఆటోమార్ట్ అధినేతలు అబ్దుల్ అజీమ్, నసీమ్ వెళ్ళడి
ఖమ్మం ప్రతినిధి మార్చి 7 (ప్రజాబలం) ఖమ్మం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మార్చి 8 వ తేదీన ఖమ్మంలోని సెల్ఫ్ డ్రైవింగ్ చేసే మహిళలకు చెందిన కార్లకు ఉచిత కార్ వాష్ సేవలు అందిస్తామని కార్ ఇన్ ఆటోమార్ట్ అధినేతలు మహమ్మద్ అబ్ధుల్ అజీమ్, నసీమ్ లు గురువారం ఒక ప్రకటన లో పేర్కొన్నారు సెల్ఫ్ డ్రైవ్ చేసే కారుకు చెందిన అన్ని ఇతర ఉపకరణాలు 50%శాతం అదనపు తగ్గింపు (రాయితీ)తో తమ సేవలు 8వతేదీ ఒక్కరోజే డిస్కౌంట్ సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు.గతంలో మహిళా వాహన యజ మానులకు ప్రత్యేకంగా డ్రైవర్లు ఉండేవారు అని, ప్రస్తుతము అన్నిరంగాల్లోనూ మహిళలు పురుషులతో పాటు సమానంగా పోటీపడుతూ.. ఏవిషయంలోను ఇతరులపై ఆధార పడకుండా స్వతంత్రంగా తమపనులు తాము చేసుకుంటూ. తమ. వాహనాలను తామే డ్రైవ్ చేసు కుంటున్నారన్నారు ఇదిచాల మంచి పరిణామమని ఏదైనా అత్యవసరపరిస్థితి వస్తే తామే స్వయంగా డ్రైవ్ చేసుకొనే ఆత్మవిశ్వాసం వారిలో ఏర్పడటం మంచి పరిణామం అని, సెల్ఫ్ కార్ డ్రైవింగ్ చేస్తున్న మహిళలను ప్రోత్సహించే ఉద్దేశంతో అన్నిరంగాల్లో అపూర్వ విజయాలను సాధిస్తున్న మహిళలపట్ల గౌరవంతో ఒక్కరోజు ఉచిత కార్ వాష్, మరియు కార్ యాక్ససరీస్ విభాగంలో 50 శాతం ఆఫర్ అందిస్తున్నామని తెలిపారు