వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్
ప్రజాబలం వరంగల్ ప్రతినిధి మార్చి 6:
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పైన సుమారు 20వేల కోట్ల భారం మోపుతూ తీసుకొచ్చిన ఎల్ఆర్ఎస్ విధానాన్ని నిరసిస్తూ బి ఆర్ ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన నిరసన ధర్నాలో భాగంగా బుధవారం వరంగల్ తూర్పు నియోజకవర్గం స్థాయి కార్యక్రమం 28వ డివిజన్ కార్పొరేటర్ గందే కల్పన నవీన్ ల ఆధ్వర్యంలో వరంగల్ చౌరస్తా లో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ కార్యక్రమం లో తూర్పు బి అర్ ఎస్ శ్రేణులు ,ఎల్ అర్ ఎస్ లబ్ధిదారులు పెద్ద మొత్తంలో హాజరై ధర్నా చేపట్టారు. ఈసందర్బంగా కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలను నశించాలని, వద్దురో నాయన కాంగ్రెస్ పాలన, ఎల్ అర్ ఎస్ ఉచితంగా అమలు చేయాలనీ పెద్ద ఎత్తున నినాదలు చేసారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా విచ్చేసిన వరంగల్ మహానగర పాలక సంస్థ మొదటి మేయర్, మాజీ శాసనసభ్యులు, బి అర్ ఎస్ తూర్పు ఇంచార్జ్ నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ ప్రతి పక్షంలో ఉన్నప్పుడు ఎల్ అర్ ఎస్ ప్రత్తిపాదన తీసుకొస్తే ఇప్పుడున్న మంత్రులు సీతక్క, ఉత్తమ్ కుమార్, కోమటరెడ్డి వెంకటరెడ్డి, బట్టి తదితరులు వ్యతిరేకంగా మాట్లాడి, మేము అధికారంలోకి వస్తే ఉచితంగా ఎల్ఆర్ఎస్ అమలు చేస్తామని మాయమాటలు చెప్పి ప్రభుత్వం ఏర్పడ్డాక 3నెలలకు ప్రజల మీద 20వేల కోట్ల భారం మోపుతూ ఎల్ఆర్ఎస్ తీసుకొచ్చిందాన్ని తక్షణమే ఫీజ్ రద్దు చేసి ఉచితంగా అమలు చేయాలనీ డిమాండ్ చేసారు. అలాగే ఎన్నికల సమయంలో 6 హామీలు,420హామీలు ఇచ్చి గద్దె నెక్కి తరువాత ఇలా ప్రజల మీద భారలు మోపడం సరి కాదని వెంటనే ఉపసంహరించకుంటే రాబోయే ఎం పి ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పుతారని హెచ్చరించారు. ఉచితంగా ఎల్ఆర్ఎస్ అమలు అయ్యే వరకు ఉద్యమిస్తామని అన్నారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రిజ్వనా షమీమ్ మసూద్, కార్పొరేటర్స్ మరుపల్లి రవి, సిద్ధం రాజు, పల్లం పద్మ రవి, బోగి సువర్ణ సురేష్ మాజీ మార్కెట్ చైర్మన్ రమేష్ బాబు, నాయకులు, డివిజన్ అధ్యక్షులు దుబ్బ శ్రీనివాస్, మనోహర్, రాంకీ యాదవ్, ఓలిశెట్టి అనిల్, ఎక్బల్, కుమార్, అనిల్, భాస్కర్, మోహన్ తదితరులతో పాటు సుమారు 1000 మంది పాల్గొన్నారు.