ఖమ్మం ప్రతినిధి మార్చి 06 (ప్రజాబలం) ఖమ్మం ఈ నెల 15వ తేదీన జరిగే తన రెండో కుమారుడు భవ్య తేజ – శేష మనోఙ్ఞ జ్యోతి ల వివాహానికి హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించాలని బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు బుధవారం హైదరాబాద్ లో మాజీ సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రువర్యులు కేటీఆర్, తన్నీరు హరీష్ రావు లను వారి వారి స్వగృహాల్లో వ్యక్తిగతంగా కలిసి వివాహా మహోత్సవ పత్రికను అందజేసి, ఆహ్వానించారు. కుటుంబ సమేతంగా వచ్చి కొత్త జంటను దీవించాలని నామ నాగేశ్వరరావు ఈ సందర్భంగా వారిని కోరారు. నామ వెంట వారిద్దరి కుమారులు నామ పృద్వీ తేజ, నామ భవ్య తేజ ఉన్నారు.
