- శాలువాతో సత్కారాలు అభినందనలు.
మెదక్ తూప్రాన్ ప్రజాబలం న్యూస్ :- మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ పరిధిలో లింగారెడ్డి ఫంక్షన్ హాల్ లో అర్.ఎం.పి, పి.ఎం.పి డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కాంగ్రెస్ మైనార్టీ నాయకులు మహమ్మద్ అప్సర్ 43వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.
శుక్రవారం ఉదయం తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. పేద రైతు కుటుంబం నుంచి వచ్చిన అప్సర్ ఆర్.ఎం.పి డాక్టర్ గా ఎంతోమందికి సహాయ సహకారాలు తక్కువ ఫీజుతో ట్రీట్మెంట్ చేస్తూ తూప్రాన్ మండలంలో ఎంతోమందికి డాక్టర్ గా సేవలందించిన డాక్టర్ మహమ్మద్ అప్సర్ బాయ్ జన్మదినం సందర్భంగా
తూప్రాన్ పట్టణ ప్రముఖులు హాజరై లింగారెడ్డి గార్డెన్స్ లో కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మహమ్మద్ అఫ్సర్ ను శాలువాతో సత్కరించి అభినందించిన వారిలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు బుడ్డ భాగ్యరాజు, తాజా మాజీ సర్పంచ్ పోచయ్య, జానకిరామ్ సిఆర్, కాంగ్రెస్ నాయకులు జగ్గన్నగారి దామోదర్ రెడ్డి, సత్యనారాయణ యాదవ్, గంగుమల్ల అచ్యుత్ రెడ్డి,కుమ్మరి రమేష్, బలరాం రెడ్డి,కిష్టారెడ్డి,గుజ మహేష్ యాదవ్, ఆకుల కుమార్, మంజు బేకరి నాగరాజుగౌడ్, నాగరాజు,దొంతి యాదగిరి, ఐలయ్య యాదవ్,సిగ్గీ,రఘుపతి. బొల్లెబోయిన మహేష్ యాదవ్,గౌస్ భాయ్,ఖాదర్,సి.హెచ్.సతీష్,ప్రజా ప్రతినిధులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు .