- విద్యావేత్త వెంకట్రామిరెడ్డి కి పూర్తి మద్దతు
- భారీ మెజార్టీతో గెలిపించుకుంటామన్న కొట్టాల యాదగిరి.
మెదక్ తూప్రన్ మే3 ప్రాజబలం న్యూస్ :-
మెదక్ జిల్ల తూప్రాన్ మండలం ముదిరాజ్ సంఘం నాయకులు మెదక్ పార్లమెంట్ అభ్యర్థి వెంకటరామిరెడ్డి గారికి సంపూర్ణ మద్దతు తెలిపారు. తూప్రాన్ మండల ముదిరాజ్ సంఘం జిన్నా రాజు మన్నే కృష్ణ , గుమ్మడి శ్రీను, పాండు , పీట్లసత్యనారాయణ, పిట్ల చంద్రం ముదిరాజ్ గారి అధ్యక్షతన ముఖ్య అతిథిగా రాష్ట్ర ముదిరాజ్ మహా సభ ఉపాధ్యక్షులు కొట్టాల యాదగిరి హాజరై ఈ సందర్బంగా వారు మాట్లడుతూ గత కెసిఆర్ ప్రభుత్వంలో సబ్బండ వర్గాలకు న్యాయం జరిగింది అని అదే విదంగా వెంకట్రాంరెడ్డి ఇక్కడి ప్రజలకు సుపరిచితులు అని మంచి మనసున్న మనిషి కష్టపడే వక్తి అని అలంటి వారు మన ఎంపీ అయితే బాగుంటుందని కాబట్టి వారిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలి అని సూచించారు. అదే విదంగా మల్లన్నసాగర్లో కొండపోచమ్మ సాగరులో అయన శ్రమ ఉన్నదని గజ్వెల్ అభివృద్ధిలో తన పాత్ర ఉన్నదిని చెప్పారు. అందుకని వారికి సంపూర్ణ మద్దతు తెలపాలన్నారు. ఈ సందర్బంగా తూప్రాన్ మండలం ముదిరాజ్ సంఘం నాయకులు ,సభ్యులు మెదక్ పార్లమెంట్ అభ్యర్థి వెంకటరామిరెడ్డి గారికి సంపూర్ణ మద్దతు తెలిపారు. తూప్రాన్ మండల ముదిరాజ్ సంఘం నాయకుల అధ్యక్షతన ముఖ్య అతిథిగా ముదిరాజ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సంఘంకొట్టాల యాదగిరి గారి ఆధ్వర్యంలో తూప్రాన్ మండలం ముదిరాజ్ సంఘం నాయకులతో సమావేశం ఏర్పాటు ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో సంఘం నాయకులందరూ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి వెంకటరామిరెడ్డి గారికి పూర్తి మద్దతు ప్రకటించారు… అదేవిధంగా మాజీ మంత్రివర్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు మరియు వెంకటరామిరెడ్డి ముదిరాజ్ సంఘం నాయకులతో ఫోన్లో మాట్లాడి వారికి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది…

సంఘం నాయకులతో మెదక్ పార్లమెంట్ అభ్యర్థి చరవాణిలో మాట్లాడుతూ వారందరికీ గెలిచినంక 100 కోట్లతో పివిఆర్ ట్రస్ట్ ఏర్పాటు చేసి దాని ద్వారా పేద విద్యార్థులకు విద్య కోసం సహాయం చేస్తానని తెలియజేశారు. అదేవిధంగా నియోజకవర్గానికి ఒక ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేసి ఒక రూపాయికే ఆ ఫంక్షన్ హాల్లో పేద కుటుంబాలకు పెళ్లిళ్లు, వివాహాది శుభకార్యాలకు చేసుకోవడానికి అందుబాటులోకి తీసుకొస్తానని హామీ ఇచ్చారు.
మాజీ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు చరవాణిలో మాట్లాడుతూ తూప్రాన్ మండలంలో బడా నాయకులు పార్టీకి కష్ట కాలంలో మోసం చేసి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిపోయారు… అలాంటి వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని… నమ్మకద్రోహం చేసిన వారిని క్షమించేది లేదని… తిరిగి పార్టీలోకి తీసుకునేది లేదు… కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్న తూప్రాన్ మండలం ముదిరాజ్ సోదరులకు కృతజ్ఞతలు తెలియజేశారు… మళ్లీ మన పార్టీ అధికారంలోకి వస్తుంది అని నాయకులకు ధీమా వ్యక్తం చేశారు… ముదిరాజ్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు… క్యాసాని జ్ఞానేశ్వర్ కు చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా బిఆర్ఎస్ పార్టీ అవకాశం ఇచ్చిందని… ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘం సభ్యులకు తెలియజేశారు. ముదిరాజులకు బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించామని గుర్తు చేశారు…
వెంకటాయపల్లి గ్రామంలో తూప్రాన్ మండలం ముదిరాజ్ సంఘం నాయకులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో సంఘం నాయకులందరూ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి వెంకటరామిరెడ్డి గారికి పూర్తి మద్దతు ప్రకటించారు… అదేవిధంగా మాజీ మంత్రివర్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు మరియు వెంకటరామిరెడ్డి ముదిరాజ్ సంఘం నాయకులతో చరవాణిలో మాట్లాడుతూ వారికి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది… ఈ కార్యక్రమంలో నర్ర విట్టల్ కత్తుల సత్యనారాయణ , పిట్ల రాజు, చింతల శేఖర్, రేపల్లె ప్రశాంత్,రవి రమేష్ ముదిరాజ్ సంఘం నాయకులు నాయకులు తదితరులు పాల్గొన్నారు .