ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మార్చి 03 : 10 వ తరగతి వార్షిక ఫలితాలలో ఉత్తమమైన ఫలితాలు సాధించడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు.శుక్రవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో 10 వ తరగతి వార్షిక ఫలితాలలో 10 జి.పి.ఎ. సాధించిన తెలంగాణ మోడల్ స్కూల్ విద్యార్థులను జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్ సాదయ్య ప్రిన్సిపాల్ రజిని లతో కలిసి సన్మానించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…10 వ తరగతి వార్షిక ఫలితాలలో తెలంగాణ మోడల్ స్కూల్ విద్యార్థులు హనిస్వి,రిశిత్ యాదవ్,10 జి.పి.ఎ. సాధించారని, అత్యుత్తమ ఫలితాలు సాధిస్తూ ప్రభుత్వ పాఠశాల లు ప్రజలతో నమ్మకం కలిగిస్తున్నాయని, ఈ ఫలితాల సాధనకు అధ్యాపక బృందం చేసిన కృషి అభినందనమని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.