రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జూన్ 22 : రైతులు తీసుకున్న పంట రుణమాఫీ పై కీలక ప్రకటన చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటనపై దండేపల్లి మండల కాంగ్రెస్ పార్టీ మరియు రైతులు హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.మంచిర్యాల మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు కి మంచిర్యాల నియోజకవర్గ రైతాంగం ఎల్లవేళలా రుణపడి ఉంటామని. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ద్వారానే రైతులకు మేలు జరుగుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు,సర్పంచ్ లు కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.