గాంధీ చౌక్ లో రేవంత్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం

 

రైతు సంక్షేమం కోసం కాంగ్రెస్ సర్కార్ కృషి

ఏకకాలంలో 2 లక్షలు రూపాయల రుణమాఫీ

డీసీసీ ఉపాధ్యక్షుడు చింత అశోక్ కుమార్

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జూన్ 22 : రైతు సంక్షేమం కోసం తెలంగాణలోని రేవంత్ సర్కార్ కృషి చేస్తుందని,ఏకకాలంలో రూపాయలు.రెండు లక్షలు రుణమాఫీతో ఇది రుజువయ్యిందని,కాంగ్రెస్ ఇచ్చిన హామీలను దశల వారీగా అమలు చేస్తామని డీసీసీ ఉపాధ్యక్షుడు చింత అశోక్ కుమార్ పేర్కొన్నారు. శనివారం సాయంత్రం పట్టణంలోని గాంధీ చౌక్ లో కాంగ్రెస్ శ్రేణులు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన అయన మాట్లాడుతూ…గతంలో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నపుడు దేశ వ్యాప్తంగా రూ.60 వేల కోట్లు రైతు రుణాలు మాఫీ చేసిందని గుర్తు చేశారు.కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతు పక్షపాతి అన్నారు. రైతు రుణమాఫీ పై మంత్రి మండలిలో నిర్ణయం తీసుకోవడం చాలా సాహసోపేతమైన చర్య అన్నారు.రైతుల కు రెండు లక్షల రుణమాఫీ చేయడం వలన అప్పులో కూరుకున్న రైతులు మేలు జరుగుతుందని హర్షం వ్యక్తం చేశారు.కాంగ్రెస్ పార్టీ రైతు సంక్షేమనికి కట్టుబడి ఉందని, ఎన్నికలలో ఇచ్చిన హామీ రైతులకు రుణమాఫీ చేస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు ఎండి అరిఫ్, మండల అధ్యక్షుడు పింగళి రమేష్,ఎంపీపీ అన్నం మంగ, చిన్నన్న,మార్కెట్ కమిటీ డైరెక్టర్ తోట రమేష్, అయిల్ల విజయ్, నడిమెట్ల రాజన్న, అప్పని లింగన్న,రాజు, దేవా, నాగార్జున,బాణాల రమేష్, రాజమౌళి కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking