జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జూన్ 22 : మహిళల ఆర్థిక స్వావలంబన దిశగా మహిళా శక్తి ద్వారా కృషి చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం జిల్లాలోని నస్పూర్ లోగల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు బి రాహుల్,జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి కిషన్ తో కలిసి జిల్లా అధికారులు మండల పరిషత్ అభివృద్ధి అధికారులు సిడిపిఓలు,ఎంపీఎం.లతో మహిళ శక్తి పథకం పై సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేంకు ప్రభుత్వం చేపట్టిన మహిళా శక్తి పథకం ద్వారా అనేక అవకాశాలు కల్పించడం జరుగుతుందని, ఈ అవకాశాలను మహిళలు సద్వినియోగం చేసుకొని ఆర్థిక స్వావలంబన సాధించాలని తెలిపారు.మహిళా శక్తి పథకంలో మైక్రో ఎంటర్ ప్రైజెస్ విభాగంలోని విభాగంలో 5 వేల 684 మందికి 64 కోట్ల 73 లక్షల రూపాయల,స్ర్టిచ్చింగ్ సెంటర్ల విభాగంలో 618 మందికి 2 కోట్ల 35 లక్షల రూపాయలు, పాడి పశువుల విభాగంలో 500 మందికి నాలుగు కోట్ల 50 లక్షల రూపాయలు,బ్యాక్ యార్డ్ పౌల్ట్రి విభాగంలో 2 వేల మంది కి 3 కోట్ల రూపాయలు,పౌల్ట్రి మదర్ యూనిట్ల విభాగంలో 16 మందికి 46 లక్షల రూపాయలు,మొబైల్ ఫీషరీ రిటైల్ ఔట్ లేట్ విభాగంలో 5 మందికి10 లక్షల రూపాయలు, మిల్క్ పార్లర్ల విభాగంలో ఒక్కరికి1 లక్షా 90 వేల రూపాయల,ఎం.సి.ఎంఎస్.సి మీ- సేవ విభాగంలో 20 మందికి 50 లక్షల రూపాయల ఈ వెంట్ మేనేజ్ మేంట్ విభాగంలో 21 మందికి 31 లక్షల రూపాయలు, ఎం.ఎస్ క్యాంటీన్ల విభాగంలో 40 మందికి 1కోటి రూపాయలు, ప్లాస్టిక్ వేస్టేజ్ మేనేజ్ మెంట్యూనిట్ విభాగంలో 10 మంది కి 8 లక్షల రూపాయలు, పుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల విభాగంలో 200 మందికి 4 కోట్ల రూపాయలగా కార్యచరణ రూపొందించడం జరిగిందని తెలిపారు. జిల్లాలోని 16 మండలాల్లో నిర్దేశించిన కార్యచరణ ప్రకారం లక్ష్యాలను పుర్తి స్థాయి లో సాధించేలా అధికారులు సమన్వయంతో పని చేయాలని,పథకానికి సంబంధించిన పూర్తి నివేదికను పోర్టల్ లో నమోదు చేయాలని తెలిపారు.పథకంలోని , మండల పరిధిలోని అబీవృద్ది అధికారి పథకం లక్ష్యసాధనను బాధ్యతగా తీసుకోవాలని ఎం.పి.ఎం.లు.బ్యాంక్ లింకేజీ ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధించిన అధికారులు తదితరులు పాల్గొన్నారు.