మల్లన్న సాగర్ భూ నిర్వాసితుల సమస్యలు పరిష్కారం కోసం కృషి చేస్తా

 

వెంకట్రాంరెడ్డి భూములు దళితులకు వచ్చేతవరకు కొట్లాడుతా

బిజెపిలోకి కేసీఆర్ ను ఆహ్వానించిన: మెదక్ ఎంపీ రఘునందన్ రావు

కెసిఆర్ వస్తానంటే వద్దంటాన

కెసిఆర్ కేటీఆర్ హరీష్ రావు బిజెపిలోకి రండి

అవినీతికి కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్

లీకేజీల ప్రయోగాశాల కాంగ్రెస్

సంగారెడ్డి జూన్ 22 ప్రజ బలం ప్రతినిది: తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ నిర్వహించిన మీ ట్ ది ప్రెస్ కార్యక్రమం రాష్ట్ర అధ్యక్షులు కప్పర ప్రసాద రావు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
హరీష్ రావు బిజెపిలోకి వస్తుండా అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా కెసిఆర్ ఫ్యామిలీని హరీష్ రావు, కేటీఆర్, కవితలను బిజెపి పార్టీలోకి సౌవినయంగా మీడియా ద్వారా ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు. బిజెపి పార్టీ విధానం నచ్చి పార్టీ కోసం పని చేస్తామని వచ్చే, కమ్యూనిస్టునైనా, నక్సలైటు నైనా , పార్టీ వదులుకోదని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కలెక్టర్ ఉన్న వెంకట్రాంరెడ్డి అనేక అక్రమాలు చేశారంటూ తెలివిగా ఫామ్ ల్యాండ్ పేరిట క్షీరా సాగర్ దళితుల భూములు కన్నేసిన వెంకట్రాంరెడ్డి ప్రొహిబిటేల్లో పెట్టి రైతులను ఇబ్బందిపెట్టి భూములను రైతుల నుండి తీసుకున్నారన్నారు. ప్రభుత్వానికి సలిండర్ చేస్తే తీసుకున్నామంటూ సాకులు చెప్తున్న వెంకట్రాంరెడ్డి అవినీతి బాగోతం బయటపడ్డదన్నారు. దళితుల భూములు వారికి పెంచేలా న్యాయపోరాటం చేస్తానన్నారు.


ఆదేశాలతో జంతు బలిని ఆపాలంటూ ఉన్న కోర్టు ఇచ్చిన ఆర్డర్ తో అక్రమ గో రవాణా అడ్డుకున్న కార్యకర్తలను స్వయాన తానే కోర్టులో కేసు వాదించి బేలు పిటిషన్ వేశానని పాత కేసుల పేరుతో పోలీసులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని నేడు వారికి బేల్ మంజూరు అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. లీకేజీలకు ప్రయోగశాలనే కాంగ్రెస్ పార్టీ అని కాంగ్రెస్ లో జరిగిన అవినీతి మరే పార్టీలోను జరగదని నీట్ పేపర్ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు వెలువడే వరకు వేచి చూడాల్సిన అవసరం జగ్గారెడ్డి తెలివి ఉండే మాట్లాడుతున్నాడా అని ఆయనకు పరిశ్రమలపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడని మండిపడ్డాడు తెలంగాణలో టిఆర్ఎస్ విఆర్ఎస్ ఇచ్చారని తాము మెదక్ సీటు పై పెట్టుకున్న ఆశలను పార్లమెంటు సీటు బిజెపికిచ్చి కెసిఆర్ ఆశలపై నీళ్లు చల్లారన్నారు. మూడవసారి మోడీ ప్రధానమంత్రి అయ్యేందుకు మెదక్ గెలిపించిన జిల్లా ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. మల్లన్న సాగర్ భూ బాధితుల సమస్యలను పరిష్కరిస్తానని మినీ ఇండియా గా పేరు ఉన్న పటాన్చెరులోని పరిశ్రమల సమస్యలను పరిష్కరించి. మెదక్ జిల్లాలో పరిశ్రమలు విస్తరింపజేసి ఉపాధి కల్పనే లక్ష్యంగా పని చేస్తానన్నారు. ప్రైవేటు విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కారం దిశగా కృషి చేస్తానని. జిల్లావ్యాప్తంగా పనిచేస్తున్న జర్నలిస్టులు సమస్యలు పరిష్కారం చేసేందుకు కృషి చేస్తానన్నారు.
జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు మెదక్ ఎంపీ రఘునందన్ రావు సమాధానాలు చెప్పారు. ఈ కార్యక్రమంలో IFWJ జాతీయ ఉపాధ్యక్షులు పెద్దపురం నరసింహ తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బింగి స్వామి IFWJ జాతీయ కార్యదర్శి భరత్ కుమార్ శర్మ టీజేయు రాష్ట్ర ఉపాధ్యక్షులు సాయి కృష్ణ పొడిచెట్టి రమేష్ దాసన్న రాష్ట్ర కార్యదర్శి దశరథ్, కనకా రెడ్డి, రాష్ట్ర సహాయ కార్యదర్శి బాపూరావు, గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి వేముల సుదర్శన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవి రాష్ట్ర నాయకులు సాయి శరత్ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు దేవులపల్లి ఎల్లయ్య, సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు దేవరంపల్లి అశోక్, యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు షానూర్ బాబా, జనగాం జిల్లా అధ్యక్షులు రమేష్, మెదక్ అధ్యక్షులు రామయ్య, కామారెడ్డి, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్, టీజేయు బృందం తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking