సీతక్క మహిళా శక్తి క్యాంటీన్ల ద్వారా అమ్మ చేతి వంటను ప్రతి ఇంటికి అందించాలి
మహిళా సంఘ సభ్యులందని కోటీశ్వరులను చేయడమే లక్ష్యం
గ్రామీణ మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దటమే మా టార్గెట్
పారిశ్రామికవేత్తలుగా మహిళలు ఎదగాలి..వేల మందికి ఉపాధి కల్పించాలి
ప్రజాబలం ప్రతినిధి ములుగు జిల్లా జూన్ 22 : పేదరిక నిర్మూలన జరగాలంటే మహిళలు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి పథంలో నడవాలి. మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చి స్వయం ఉపాధి అవకాశాలను పెంచుతున్నం, క్యాంటిన్లు, సోలార్ ఉత్పత్తి, ఈవెంట్ మేనేజ్మెంట్, డెకరేషన్ ఫోటోగ్రఫీ, మీ సేవ కేంద్రాల వంటి 17 రకాల ఉపాధి అవకాశాలను గుర్తించి మహిళా సంఘాలకు ఇస్తున్నాం
గ్రామాల్లో జరిగే అన్ని ఫంక్షలకు మహిళా సంఘాలు పిండివంటలు సరఫరా చేసే స్థాయికి ఎదగాలి. మహిళా శక్తి క్యాంటీన్లకు సెక్రటేరియట్లో మొదటి అడుగు పడింది
అన్ని జిల్లాల్లో మహిళా శక్తి క్యాంటీన్లను ప్రారంభించాలి. 20 రోజుల్లో జిల్లా ఆస్పత్రుల్లో మహిళా శక్తి కాంటీన్లు ప్రారంభించాలి
మహిళా శక్తి క్యాంటీన్లలో నాణ్యమైన రుచికరమైన ఆహారాన్ని అందించాలి
అమ్మ చేతి వంట ప్రతి ఒక్కరి ఇంట అన్నట్లుగా మహిళా శక్తి క్యాంటీన్లు పని చేయాలి
ప్రతి మహిళ ఆర్థికంగా ప్రగతి సాధించాలని ఆకాంక్షిస్తున్న అని చెప్పారు.