డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్, గింజల నర్సిరెడ్డి, దమ్మాలపాటి సత్య నారాయణ
ఖమ్మం ప్రతినిధి మే 24 (ప్రజాబలం) ఖమ్మం వరంగల్ నల్గొండ పట్టభద్రుల కాంగ్రెస్ పార్టీఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేయుచున్న ప్రశ్నించే గొంతుక తీన్మార్ మల్లన్న ను అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గింజల నర్సిరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ దమ్మలపాటి సత్యనారాయణ పిలుపునిచ్చారు
శుక్రవారంనాడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తీన్మార్ మల్లన్న గెలుపు కోసం కామేపల్లి మండలంలోని సాతాని గూడెం బాసిత్ నగర్, జగన్నాథ్ తండా, టేకులపల్లి, మద్దులపల్లి గ్రామాలలో పర్యటించి పట్టభద్రులను కలిసి చైతన్య స్ఫూర్తిగా నిలిచిన తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి, గెలిపించాలని కోరడం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన పట్టభద్రుల సమావేశంలో మల్లిబాబు యాదవ్ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలు నుండి తన సొంత యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలంగాణ ప్రజలను చైతన్య పరుస్తూ కెసిఆర్ ని ఓడించి కాంగ్రెస్ పార్టీ విజయంలో కీలకపాత్ర వహించిన వ్యక్తి తీన్మార్ మల్లన్న అని, రెండు సంవత్సరముల క్రితం టిఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి పై ఇండిపెండెంట్ గా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోవడం జరిగిందని, ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని నిలదీస్తూ ప్రశ్నించే తత్వం ఉన్న తీన్మార్ మల్లన్న ను గెలిపించుకొని శాసనమండలికి పంపించవలసిన అవసరం ఉన్నదని అన్నారు. గతంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకే అధికార పార్టీ అక్రమ కేసులు బనాయించి మల్లన్న ను జైలుకు పంపించడం జరిగిందని, ఇప్పటికీ పోలీస్ స్టేషన్ లకు కోర్టుకి వాయిదాలకు తిరుగుతూ వున్నాడని, ఎన్ని నిర్బంధాలు ఎదురైనా మొక్కవోని ధైర్యంతో బీసీ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలను చైతన్య పరుస్తూ ఈనాటికీ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రజలకు దగ్గరవుతున్న మల్లన్న కు పట్టభద్రులంతా ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా మల్లి బాబు యాదవ్ కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు షేక్ ఫతే మహమ్మద్, దమ్మాలపాటి రాంబాబు కీసర నర్సిరెడ్డి,
ఎంపీటీసీలు జగన్నాథ రెడ్డి,నల్లమోతు లక్ష్మయ్య గబ్రు నాయక్, రడబోతు గోపిరెడ్డి, ఇమ్మడి రామనాథం కాట్రాల వీరబాబు, మాలోత్ బావ్ సింగ్,భూక్య కిషన్ బానోత్ రాందాస్, జాజిరి రాము, వీరన్న దుబాయ్ రవి, కోలం రమేష్, ధరావత్ బాబు గుగులోత్ కుమార్, సూర నాగేశ్వరరావు ధరావత్ బాబు, కన్నబోయిన శ్రీను, మరియు సర్పంచులు ఎంపీటీసీలు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు