పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మా తోటి అధ్యాపకుడు కోడిరెక్క ఉమా శంకర్ కే మా మద్దతు

 

తెలంగాణ లెక్చరర్స్ ఫోరం ఖమ్మం జిల్లా అధ్యక్షుడు వంకుడోత్ రాంబాబు

 

ఖమ్మం ప్రతినిధి మే 24 (ప్రజాబలం) ఖమ్మం
వరంగల్ -ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో తెలంగాణ ఉద్యమకారుడు మా తోటి ప్రైవేట్ అధ్యాపకుడు కోడిరెక్క ఉమా శంకర్ కే మా మద్దతు ఉంటుందని తెలంగాణ లెక్చరర్స్ ఫోరం ఖమ్మం జిల్లా అధ్యక్షుడు వంకుడోత్ రాంబాబు తెలిపారు. గత 14 సంవత్సరాలుగా ప్రైవేట్ అధ్యాపకుడిగా పనిచేస్తూ ప్రైవేట్ ఉద్యోగుల కష్టాలు తెలిసిన వ్యక్తిగా అతనికే ఓటు వేసి గెలిపించాలని ప్రైవేట్ అధ్యాపకులను కోరారు. పట్టభద్రులు అందరూ సీరియల్ నంబర్ 23 పై అమూల్యమైన మొదటి (1) ప్రాధాన్యత ఓటును వేసి ఉమాశంకర్ ని గెలిపించాలని పిలుపు నిచ్చారు.

నేను నిరుద్యోగినే మీ వాడిని గెలిపించి చట్టసభలకు పంపండి సేవ చేస్తా

స్వతంత్ర అభ్యర్థి కోడిరెక్క ఉమా శంకర్

వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేస్తున్న స్వతంత్ర అభ్యర్థి కోడిరెక్క ఉమా శంకర్ శుక్రవారం కొత్తగూడెం పట్టణంలోని గ్రంథాలయంలో ఓటును అభ్యర్థించారు. నేను నిరుద్యోగినే ప్రైవేట్ అధ్యాపకునిగా పనిచేస్తున్నాను ఉద్యోగ భద్రత లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నానని మధ్యతరగతి కుటుంబంలో పుట్టి స్వశక్తితో ఈ స్థాయికి వచ్చానని అన్నారు. నాకు మద్దతు తెలిపి అధిక మెజారిటీతో గెలిపించాలని మీ అమూల్యమైన మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని కోరారు. ఈ కార్య్రమంలో జక్కుల శివ కుమార్ బమ్మెర అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking