ఫోక్సో, గ్రేవ్ కేసుల్లో త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయాలి,
ఎస్.పి డా.శ్రీ.బి.బాలస్వామి ఐ.పి.ఎస్
మెదక్ ప్రజాబలం న్యూస్ :-
మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్.పి డా.శ్రీ.బి.బాలస్వామి ఐ.పి.ఎస్ గారు జిల్లా సిబ్బందితో నెల వారి నేర సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. పెండింగ్ ఉన్న (అండర్ ఇన్వెస్టిగేషన్) కేసులలో గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసుల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్.పి డా.శ్రీ.బి.బాలస్వామి ఐ.పి.ఎస్ మాట్లాడుతూ..
వచ్చే నెల జూన్ 08 వ తారీఖున మేగా లోక్ అదాలత్ ఉన్నందున రాజీ పడే అవకాశం ఉన్న కేసులను ఎక్కువ సంఖ్యలో రాజీ పడేటట్లు సిబ్బంది కృషి చేసి ఎక్కువ మొత్తంలో కేసులు రాజీ అయ్యేటట్లు చూడాలని సిబ్బందిని ఆదేశించారు. అలాగే కేసు నమోదు నుండి చార్జిషీట్ వరకు ప్రతి విషయాన్నికూలంకుషంగా పరిశోధన చేసి ఫైనల్ చేయాలని జిల్లాలో ఇప్పటివరకు నమోదైన గ్రేవ్ నాన్ గ్రేవ్ కేసులలో ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ చెయ్యాలి ఏ ఏ అంశాలు క్రోడికరించాలి తదితర అంశాల గురించి వివరించారు. ఎస్‌సి ఎస్.టి, ఫోక్సో, గ్రేవ్ కేసుల్లో త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయాలి. లాంగ్ పెండింగ్ కేసులు త్వరగా చేదించాలి, కేసుల చేదనలో అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించాలి, పెరుగుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి ఛాలెంజ్ గా విధులు నిర్వహించి ప్రజల మన్ననలు పొందాలి, మిస్సింగ్ కేసులను త్వరగా చేదించాలని అన్నారు. సైబర్ క్రైమ్ కేసుల వివరాలు, రిసెప్షన్, క్రైమ్ వర్టికల్, టెక్ టీమ్, స్టేషన్ రైటర్, కోర్టు డ్యూటీ ఆఫీసర్, తదితర వర్టికల్, విధులు నిర్వహించే అధికారులకు సిబ్బందికి పలు సూచనలు చేస్తూ వారి యొక్క పనితనాన్ని మరింత మెరుగుపరచాలని అధికారులకు సూచించారు. సైబర్ నేరాల నియంత్రణ గురించి సిసి కెమెరాల ఆవశ్యకత గురించి గ్రామాలలో పట్టణాలలోఆయా గ్రామాల విపిఓలు పోలీస్ అధికారులు సిబ్బంది ప్రోయాక్టివ్ పోలీసింగ్ విధులు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.అలాగే సిసి కెమెరాల ప్రాధాన్యాన్ని గుర్తించాలని అన్ని పోలీస్ స్టేషన్ ల పరిధిలోని గ్రామాల్లో ప్రదాన కూడల్లలో సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకునేందుకు దాతలు ముందుకు రావాలని కోరారు.
సమావేశంలో జిల్లా అదనపు ఎస్.పి అడ్మిన్ శ్రీ.మహేందర్ , మెదక్ డి.ఎస్.పి డా.శ్రీ.రాజేష్ , సైబర్ క్రైమ్ డి.ఎస్.పి. శ్రీ.సుభాష్ చంద్ర బోస్, ఎస్.బి.సి.ఐ.శ్రీ.సందీప్ రెడ్డి , డి.సి.ఆర్.బి సి.ఐ శ్రీ.మధుసూదన్ గౌడ్ , జిల్లా సి.ఐ.లు, ఎస్.ఐ.లు మరియు సిబ్బంది పాల్గొన్నారు.