జాతీయ లోక్‌ అదాలత్‌ లో పెద్ద ఎత్తున కేసుల పరిష్కారం చేయాలి

రాజి మార్గమే రాజా మార్గం అనే నినాదాన్ని ప్రజల్లో నింపాలి
జిల్లా ప్రధాన న్యాయమూర్తి గౌరవనీయులు పి. నారాయణ బాబు అన్నారు
పోలీసు అధికారులకు పలు సూచనలు చేసిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి
జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జూన్‌ ఎనిమిదవ తారీఖున నిర్వహించబోయే జాతీయ లోక్‌ అదాలత్‌ లో పెద్ద ఎత్తున కేసులను పరిష్కారం చేయడానికి కృషి చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గౌరవనీయులు పి. నారాయణ బాబు పోలీసు అధికారులకు సూచనలు చేశారు.
జిల్లాలోని పోలీసు అధికారులతో శుక్రవారం సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా జడ్జి మాట్లాడుతూ ప్రజల్లో ద్వేష భావాలను తగ్గించి కేసుల్లో రాజీ మార్గాన్ని అలవాటు చేయాలని అన్నారు. రాజి మార్గమే రాజా మార్గం అని ప్రజల్లో నింపాలని, దాంతో విలువైన సమయం, డబ్బు దుర్వినియోగం కాదని అన్నారు.
చిన్న చిన్న సమస్యలను పెద్దవి చేసుకొని పంతాలకు పోయి కేసుల్లో ఇరికితే పొలిసు స్టేషన్లు, కోర్టులకు ఎక్కితే నష్టమే తప్ప లాభం ఉండదని జడ్జి అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రిన్సిపాల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి గౌరవనీయులు శ్రీ ఎన్‌. రామచంద్రా రావు జిల్లా ఎక్సయిజ్‌ సూపరింటెండెంట్‌ శ్రీనివాస్‌ డి ఎస్‌ పీ లు సంపత్‌ రావు నారాయణ గారు, ఎస్సై లు, సీఐలు, న్యాయసేవాధికార సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking