ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ కి శుభాకాంక్షలు తెలిపిన పల్లె

 

ఎమ్మెల్సీ, పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ బొమ్మ మహేష్ గౌడ్ జన్మదినం పురస్కరించుకుని హైదరాబాద్ లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో మహేష్ గౌడ్ ని తెలంగాణ గౌడ్ సంఘం అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్ రావు గౌడ్ శాలువా కప్పి పుష్పగుచ్ఛము అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా పల్లె లక్ష్మణ్ రావు గౌడ్ మాట్లాడుతూ మహేష్ గౌడ్ క్రమశిక్షణ గల నాయకుడని కొనియాడారు. విద్యార్ధి నాయకుడిగా మొదలైన ప్రస్థానం వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎదిగిన గొప్ప నాయకుడన్నారు. మహేష్ గౌడ్ మరిన్ని ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పిసిసి కార్యాదర్శి ప్రవీణ్, కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్, గౌడ్ కంఠమ్ జాతీయ మాస పత్రిక ఎడిటర్ నోముల సిద్దూ గౌడ్, తెలంగాణ గౌడ్ సంఘం రాష్ట్ర కార్యదర్శి నేమూరి సాయి రామ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking