హరీష్ రావు, నామ ఎదుట రైతుల ఆవేధన

 

రైతు సమస్యలపై అధికారికి ఫోన్

కేసీఆర్ ప్రభుత్వం రైతులకు అండగా నిలిచింది

నూతనకల్ వద్ద రైతులతో హరీష్ రావు, నామ నాగేశ్వరరావు

ఖమ్మం ప్రతినిధి మే 24 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా తల్లాడ మండలం నూతనకల్ వద్ద మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు , ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు లను రైతులు కలిసితమ గోడు వెళ్లబోసు కున్నారు .వారు సత్తుపల్లి వెళ్లి వస్తుండగా నూతనకల్ వద్ద అపి, వారికి తమ సమస్యలు వివరించి, ఆవేదన వ్యక్తంచేశారు.
అనేక సమస్యలతో సతమత మవుతున్నా పట్టించుకునే నాధుడే కరువయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంతవరకు జీనుగు,వరి తదితర విత్తనాలు అందు బాటులో లేవని, కళ్యాణ్ లక్ష్మి రావడంలేదని ,దొడ్డు వడ్లను కొనుగోలు చేయడం లేదని ఏకరువు పెట్టారు .సాగర్ నీరు కూడా రాకపోవడంతో పంటలు ఎండిపో యాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే హరీష్ రావు స్పందించి సంబంధిత అధికారికి ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతుల సమస్యలను పరిష్కరించాలని ఆయన అధికారులను కోరడం జరిగింది .దొడ్డు వడ్లను ఎందుకు కొనుగోలు చేయడం లేదని ఆయన ఈ సందర్భంగా అధికారులనుప్రశ్నించారు రైతులకు కెసిఆర్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇచ్చే అండగా నిలిచిందని, పండిన పంటనంతా దాన్యం కొనుగోలు కేంద్రాలు ద్వారా కొనుగోలు చేయడం జరిగిందని చెప్పారు. డబ్బును కూడా సత్వరమే వారి ఎకౌంట్లో జమ చేయడం జరిగిందని ఈ సందర్భంగా చెప్పారు .విత్తనాల కొరత లేకుండా ముందస్తుగానే ఏర్పాటు చేసి రైతులను ఆదుకున్నామని చెప్పారు ఎప్పటికప్పుడు సాగునీటిని విడుదల చేసి పంటలు ఎండిపోకుండా కాపాడామని గా హరీష్ రావు రైతులతో అన్నారు .ఏ సమస్య వచ్చినా రైతులకు అండగా ఉంటామని భయపడాల్సిన అవసరం లేదని హరీష్రావు స్పష్టం చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking