ఖమ్మం ప్రతినిధి మే 24 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా తల్లాడ మండలం మిట్టపల్లి లో డీసీఎంఎస్ మాజీ చైర్మన్ రాయలసీ శేషగిరి రావు మృతి చెందగా, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ,పార్లమెంటు సభ్యులు నామ నాగేశ్వరరావు సండ్ర వెంకట వీరయ్య ,తాతా మధు తదితరులు శుక్రవారం మిట్టపల్లి లోని వారింటికి వెళ్లి, హరీష్ రావుతో కలసి శేషగిరిరావు చిత్ర పటానికి పూల మాల వేసి, సంతాపం తెలిపి, ఘనంగా నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి, తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. దైర్యంగా ఉండాలని, పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని వారు భరోసా ఇచ్చారు.ఆయన పవిత్రాత్మకు శాంతి కలగాలని దైవాన్ని ప్రార్ధించారు