ఖమ్మం నగర కాంగ్రెస్అధ్యక్షులుమహ్మద్ జావేద్
ఖమ్మం ప్రతినిధి అక్టోబర్ 4 (ప్రజాబలం) ఖమ్మం పాత్రికేయ మిత్రులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయింపు కోసం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయటం జరిగింది దీనికి మద్దతు గా కాంగ్రెస్ పార్టీ ఖమ్మం నగర అధ్యక్షులు మహ్మద్ జావేద్ పాల్గొన్నారు వారు మాట్లాడుతూ జర్నలిస్టుల కు వివిధ సంఘాల ప్రతినిధులకు మద్దతు తెలుపుకుంటూ వీరు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారిదిగా ఉంటూ అన్ని సాధకబాదలను ప్రజల ముందు ఉంచడమే కాకుండా వారిని ప్రభుత్వాల మీద పోరాడే హక్కును కల్పిస్తున్నప్పుడు మీ ఇళ్ల స్థలాల హక్కుల కోసం మా పార్టీ మీకు అండగా ఉండి మీకు ఇల్లస్థలాలే కాకుండా దానిలో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టించే వరకు పోరాడుతామని అంతేకాకుండా గత కాంగ్రెస్ ప్రభుత్వంలో జర్నలిస్టు ప్లాట్లు ఇచ్చారని అని గుర్తు చేశారు మేము ఎప్పుడూ జర్నలిస్టు లకు అండగా ఉంటామని అన్నారు.ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటుచేసిన సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరావు మరియు జిల్లా కార్యవర్గానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు