మంత్రులు హరీష్ రావు, పట్నం మహేందర్ రెడ్డి
కొడంగల్ ప్రజాబలం ప్రతినిధి:కొడంగల్ నియోజకవర్గం కోస్గి లో రూ. 17 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన రాష్ట్ర మంత్రులు హరీష్ రావు, పట్నం మహేందర్ రెడ్డి, పాల్గొన్న మండలి వైస్ చైర్మన్ బండ ప్రకాష్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి.
కోస్గిలో 6 కోట్లతో నిర్మించిన 50 పడకల ఆసుపత్రి నీ ప్రారంభించిన మంత్రులు హరీష్ రావు మహేందర్రెడ్డి ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి.
కోస్గి మున్సిపాలిటీలో 10 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన మంత్రులు మహేందర్రెడ్డి హరీష్ రావు.
రూ.30 లక్షల నిధులతో నిర్మించనున్న యాదవ్ భవనం శంకుస్థాపన, రూ. 30 లక్షలతో నిర్మిస్తున్న ముదిరాజ్ భవనానికి శంకుస్థాపన, రూ. 30 లక్షలతో నిర్మిస్తున్న అంబేద్కర్ భవనానికి శంకుస్థాపన చేసిన మంత్రులు హరీష్ రావు, మహేందర్ రెడ్డి ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి, మండలి వైస్ చైర్మన్ బండ ప్రకాష్ ముదిరాజ్.
ప్రగతి నివేదన సభ కోస్గి
మంత్రి హరీష్ రావు
గత ఎన్నికల్లో రేవంత్ పని
చేస్తలేడు అని నరేందర్ రెడ్డిని గెలిపించుకున్నారు
మన ప్రభుత్వం వచ్చాక కోస్గి
లో 50 పడకలు, మద్దూరులో 30 పడకల ఆస్పత్రిని నిర్మించాము
పది సంవత్సరాలలో
రేవంత్ ఒక్క దవాఖన తేలేదు
ఇప్పుడు మనకు మూడు ఆస్పత్రులు వచ్చాయి
కాంగ్రెస్ హయాంలో నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే వారు …
నేడు పొదాము పద బిడ్డ సర్కార్ దవాఖానకు అంటున్నారు
నరేందర్ రెడ్డి వచ్చాక ఇంటింటికీ నల్లా నీరు ఇచ్చి దాహం తీర్చారు
రేవంత్ ఉంటే ఇంకా పదేండ్లు అయిన నీరు రాకపోయేది
కృష్ణా జలాలు నార్లపూర్ రిజర్వాయర్ లోకి వచ్చాయి
ఇప్పుడు కూడా గెలిపించండి కృష్ణమ్మ నీళ్లతో మీ పాదాలు తడుపుతాము
సాగు నీరు కోసం పాలమూరు కాల్వలు తవ్వుతున్నాము
ఇప్పుడు మంచి నీరు వచ్చింది, తర్వాత సాగు నీరు వస్తది
దాంతో మనం వలస పోవాల్సిన ఆవాసరం లేదు
మూడు గంటల కరెంట్ ఇస్తే మూడు ఎకరాలు ఎలా పారుతది
మూడు గంటల కరెంట్ కావాలి అంటే రేవంత్ కు…
24 గంటల కరెంట్, పాలమూరు నీరు కావాలి అంటే నరేందర్ రెడ్డి కి ఓటు వేయాలి.
రేవంత్ కు ఓటేస్తే కైలాసంలో పెద్ద పాము మింగినట్టే
కాంగ్రెస్ అధికారంలో ఉన్న
కర్ణాటక లో ఆడపిల్ల పెండ్లికి పైసలు ఇస్తున్నరా
అక్కడ మూడు రోజులకు ఒకసారి నల్లా వస్తది
కర్ణాటక లో ఆరు వందల పెన్షన్ ఇస్తున్నారు

మేము గెలిస్తే 4 వేలు ఇస్తాము అంటున్నారు.. గతంలో మీరే కదా అధికారంలో ఉన్నది అప్పుడు ఎందుకు ఇవ్వలేదు
అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఇవ్వడం చాతకాదు..కానీ ఇక్కడ ఇస్తారట
బిజెపి లేచేది లేదు..కాంగ్రెస్ గెలిచేది లేదు
మీ అందరికీ మేము తోడుగా ఉంటాము
ఇది వెనకబడ్డ ప్రాంతం
ఇక్కడకు కృష్ణా జలాలు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు కేసీఆర్ గారు
రేవంత్ ను తప్పు చేసినవు విచారణ జరపాల్సిందే అని సుప్రీంకోర్టు నిన్న తీర్పునిచ్చింది.
విచారణ అయ్యేది కాయం.. జైలుకు పోయేది కాయం.
నారాయణ పెట్ లో మెడికల్ కాలేజినీ ప్రారంభిస్తాం
మహిళల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను చేపట్టారు కేసీఆర్ గారు
ఆడపిల్లల కోసం కాలేజీలు, యునివర్సిటీ ఏర్పాటు చేసాము
మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం మా ప్రభుత్వం కృషి చేస్తుంది.
త్వరలోనే మం మానిఫెస్టో వస్తుంది. అందులో మహిళలకు శుభవార్త ఉంటుంది
మంత్రి పట్నం మహేందర్ రెడ్డి

వెనకబడిన కొడంగల్ కు పెద్ద ఎత్తున నిధులను కేటాయించారు సిఎం కేసీఆర్.
నరేందర్ రెడ్డి గెలిచాక ఇంకా చాలా నిధులు వచ్చాయి.
మోడీ వేస్తే వాళ్ళ నాయకులే రాలేదు.
మూడోసారి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేద్దాము
కాంగ్రెస్, బిజెపి లను ఎవరు నమ్మొద్దు.
బండ ప్రకాష్ మండలి డిప్యూటి చైర్మన్
గతంలో కొడంగల్ అంటే మీది వరంగలా…అనే వారు
గతంలో ఎక్కడికైనా వెళ్దాము అంటే రోడ్ సౌకర్యం ఉండేది కాదు.
ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి
అభివృద్ధికి ఆమడ దూరంలో కొడంగల్ ఉండేది.
మన ప్రభుత్వం వచ్చాక
రెండు మునిసిపాలిటి లకు 90 కోట్ల నిధులతో అభివృద్ధి చేసాము.
మహ బూబ్ నగర్ చించోలి రోడు కోసం సిఎం కేసీఆర్ గారు కేంద్ర మంత్రి నితిన్ ఘడ్కరి తో మాట్లాడారు
కొస్గి మహబూబ్ నగర్ రోడ్ ను బాగు చేసుకున్నాము
మాటలే కానీ చేతల్లో లోని వ్యక్తి రేవంత్
అమెరికాలో రైతులకు 3 గంటల కరెంట్ చాలు అన్నాడు..మనకు అలాంటి వారు కావాలా..
కొస్గి రెవెన్యూ డివిజన్ గురించి సిఎం కేసీఆర్ గారికి వివరిస్తాము.
తండాలను గ్రామ పంచాయితీలుగా చేసుకున్నాము.
నియోజక వర్గంలో ని ప్రతి తండాకు రోడ్లు వేసుకున్నాము
