బీఆర్ఎస్ పార్టీలోకి కాంగ్రెస్ జడ్పీటీసీ ముత్తే సత్తయ్య చేరిక

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి అక్టోబర్ 18 మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట మండలంలోని తిమ్మాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ జడ్పీటీసీ,మంచిర్యాల జిల్లా జడ్పీ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ ముత్తే సత్తయ్య బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు సమక్షంలో
బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. బుధవారం కరీంనగర్ లోని బహిరంగ సభకు హాజరైన కే టీ ఆర్ సమక్షంలో మంత్రి గంగుల కమలాకర్, పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత,మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు, మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద రెడ్డి ఆధ్వర్యంలో జడ్పీటీసీ ముత్తే సత్తయ్య బీఆర్ఎస్ లో చేరారు.ఈ సందర్భంగా జడ్పీటీసీ ముత్తే సత్తయ్య మాట్లాడుతూ… ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి,సంక్షేమ పథకాలు చూసి బీఆర్ఎస్ లో చేరినట్లు వివరించారు,అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ నుండి తన అనుచరులతో పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీ చేరికలు ఉంటాయని తెలిపారు ప్రజలకు మేలు జరిగే విధానాలు తనకు ముఖ్యమని ఆయన తెలిపారు.సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రజలు ఆనందంగా ఉన్నారని, ప్రజల మద్దతు బీఆర్ఎస్ ఉందన్నారు.రాబోయే రోజుల్లో ప్రజలకు మరెన్నో సేవలoదిస్తామని వెల్లడించారు.ఈ కార్యక్రమంలో లక్షెట్టిపేట మున్సిపల్ చైర్మన్ నల్మాస్ కాంతయ్య,డీసీఎమ్మెస్ చైర్మన్ తిప్పని లింగయ్య, మాజీ డీసీఎమ్మెస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి,బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చుంచు చిన్నయ్య, తిమ్మాపూర్ సర్పంచ్ చుంచు రవి,బీఆర్ ఎస్ మండల యూత్ అధ్యక్షులు అంకతి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking