ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..నిర్మల్ జిల్లా యూట్యూబర్స్ న్యూస్ అసోసియేషన్ కార్యవర్గం ఎన్నిక. నిర్మల్ జిల్లా..సమాజంలో జరుగుతున్న సంఘటనలు కార్యక్రమాలను అత్యంత వేగంగా చలనచిత్రాల ద్వారా ప్రజలకు అందిస్తున్న నిర్మల్ జిల్లా యూట్యూబర్స్ న్యూస్ అసోసియేషన్ను బుధవారం నిర్మల్ పట్టణంలోని ఎస్టీయు భవనంలో ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా అసోసియేషన్ అధ్యక్షులుగా మహమ్మద్ ఉస్మాన్,ఉపాధ్యక్షులుగా తోగిటి రాంప్రసాద్ ,ప్రధాన కార్యదర్శిగా గైని భోజన్న సహాయ కార్యదర్శిగా అజీజ్ సిద్ధిఖీ, సంయుక్త కార్యదర్శిగా డి.కృష్ణ ,కోశాధికారిగా బొబ్బిలి ప్రసాద్, గౌరవ అధ్యక్షులుగా రషీద్ ఆలం, గౌరవ సభ్యులుగా తాహెర్ పఠాన్ ,తోగిటి విజయ ప్రసాద్ తదితరులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని పలు నిర్ణయాలు, తీర్మానాలు చేసుకోవడం జరిగింది.