ఖమ్మం యువజన సింహ గర్జన మహా సభను జయప్రదం చేయండి

స్థానిక ప్రెస్ క్లబ్ లో గోడపత్రిక ఆవిష్కరించిన యువజన జేఏసీ నాయకులు

ఖమ్మం ప్రతినిధి అక్టోబర్ 30 (ప్రజాబలం) ఖమ్మం స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ యూత్ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర ఛైర్మెన్ మద్ధిశెట్టి అజయ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే బ్రతుకులు మారతాయి అని , నీళ్ళు నిధులు ఉద్యోగాలు వస్తాయని యువత ముందు వరస లో నిలబడి కొట్లాడాం . 12 వందల మంది ప్రాణాలు అర్పించారు జైళ్లలో లాఠీ దెబ్బలు తిన్నాం . సర్వం కోల్పోయి రాష్ట్రం తెచ్చుకుంటే ఈ రోజు కెసిఆర్ పాలన లో మళ్లీ మోసపోయిన యువత ఆత్మహత్య ల బాట పట్టిండ్రు ! Brs పార్టీ విధానాలతో తెలంగాణ లో దొరల పాలన జరుగుతోంది . ఈ నిరంకుశ పాలన నీ పాతి పెట్టేందుకు మరో ఉద్యమం మొదలు పెడుతున్నా మ్ వచ్చే ఎన్నికల్లో యువకుల సత్త చూపించేందుకు ఖమ్మం లో ఎస్ ఆర్ కన్వెన్షన్ హాల్ లో సింహ గర్జన మహాసభ సభ జరుపుతున్నాం అని అన్నారు ఈ కార్యక్రమంలో తెలంగాణ యూత్ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పొనుగోటి సంపత్ రాష్ట్ర మరియు జిల్లా బాధ్యులు నాగ చారి జిల్లా అధ్యక్షులు గుండా నరేష్ జిల్లా ఉపాధ్యక్షులు షేఖ్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking