సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ నితేష్ వ్యాస్
ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా: తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ను సజావుగా నిర్వహించేందుకు అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ నితేష్ వ్యాస్ అన్నారు. సోమవారం న్యూ ఢిల్లీ నుంచి సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ నితేష్ వ్యాస్ ఎన్నికల పోలింగ్ నిర్వహణ, సన్నద్ధతపై నిర్వహించిన వీడియో సమావేశంలో హైదరాబాద్ నుండి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ముఖ్యఎన్నికల అధికారి వికాస్ రాజ్, రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులతో కలిసి పాల్గొనగా, సమీకృత జిల్లా కలెక్టరేట్ నుండి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్, జిల్లా అదనపు కలెక్టర్లు విజయేందర్రెడ్డి, అభిషేక్ అగస్త్య, జిల్లా రెవెన్యూ అధికారిణి హరిప్రియ, డీసీపీ శబరీష్, రిటర్నింగ్ అధికారులతో కలిసి ఈ వీడియో సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ నితేష్ వ్యాస్తో మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ సూచనలు పాటిస్తున్నామని జిల్లా వ్యాప్తంగా ఎన్నికలకు సంబంధించి పకడ్భందీ ఏర్పాట్లు చేయడం జరుగుతుందని వీడియో సమావేశంలో ఉన్నతాధికారులకు వివరించారు. అలాగే గ్రీవెన్స్ కమిటీకి ఇప్పటి వరకు నగదు, బంగారం తదితరాలకు సంబంధించి 165 ఫిర్యాదులు రాగా అందులో 113 డిస్పోజల్ చేయడం జరిగిందని 6 ఎఫ్ఐఆర్ చేయగా ఆధారాలు లేని 46 దరఖాస్తులు ఉన్నాయని ఈ సందర్భంగా వీడియో సమావేశంలో తెలిపారు.