కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 100 రోజుల్లో 6 స్కీములు అమలు చేస్తామని ప్రేమ్ సాగర్ రావు

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి అక్టోబర్ 30 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట మున్సిపాలిటీ లోని ఎస్ ఆర్ ఆర్ గార్డెన్ లో జరిగిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో నిర్వహించారు,ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 100 రోజుల్లో 6 స్కీములు అమలు చేస్తామని అన్నారు. సోమవారం ఈ సందర్భంగా ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ…మంచిర్యాల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గా నన్ను అత్య అధిక మెజార్టీతో గెలిపించాలని ఇందుకోసం ప్రతి కార్యకర్త సన్నద్ధమై సమన్వయంతో పనిచేయాలని సూచించినారు.ప్రతి కార్యకర్తను గుండెల్లో పెట్టుకొని చూసుకునే బాధ్యత నాది అని అన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టబోతుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల స్కీములను 100 రోజుల్లోపు అమలు చేస్తామని అన్నారు. లక్షెట్టిపేట మున్సిపాలిటీ మండలంలోని పలు గ్రామాలకు చెందిన సుమారు 100 మంది కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు చింత అశోక్ కుమార్,పట్టణ అధ్యక్షుడు ఎండీ అరిఫ్,కౌన్సిలర్ రందేని వెంకటేష్,పార్టీ మండల అధ్యక్షుడు పింగళి రమేష్, ఎంపీపీ అన్నం చిన్నాన్న మంగ,వైస్ ఎంపీపీ దేవేందర్ రెడ్డి,యూత్ అధ్యక్షుడు రందేని వెంకటేష్,బియ్యల తిరుపతి,శ్రీధర్,నవాబ్, విజయ్,బి రాజు,అమీర్, షఫీ,బాలు,శ్రీకర్,శంకర్, సర్పంచులు ఎంపీటీసీలు సీనియర్ నాయకులు మహిళా కాంగ్రెస్ నాయకురాలు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking