ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా.. సి-విజిల్ యాప్ ద్వారా ప్రతి ఒక్క పౌరుడు తమ దృష్టికి వచ్చిన ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై ఫిర్యాదు చేయవచ్చని జిల్లా ఎన్నికల అధికారి/ జిల్లా పాలనాధికారి అశిష్ సంగ్వాన్ తెలిపారు.
సి-విజిల్ యాప్ ద్వారా అందిన ఫిర్యాదుల పై వంద నిమిషాలలో ఎన్నికల సంఘం స్పందిస్తుందని ఈ యాప్ ద్వారా ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం వంటి వాటి పై ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.
ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు పాల్పడడం, తదితర వాటిని పౌరులు గుర్తించినట్లైతే వెంటనే ఈ యాప్ ద్వారా ఫిర్యాదు చేయా వచ్చని ఆన్నారు.ఫోటోలు లేదా వీడియోలను యాప్ లో అప్లోడ్ చేయడం ద్వారా ఫిర్యాదులు నమోదు చేయవచ్చని తెలిపారు.
యువత సి-విజిల్ యాప్ ను ఉపయోగించి ఎన్నికల్లో జరిగే ఎన్నికల కోడ్ ఉల్లంఘన లను తమ దృష్టికి తీసుకురావాలని, కలెక్టరేట్ కార్యాలయంలోని ఫిర్యాదుల పర్యవేక్షణ కేంద్రం నుండి సి-విజిల్ యాప్ ఫిర్యాదులపై పర్యవేక్షణ చేయడం జరుగుతున్నదని, ఫిర్యాదు చేసిన వారి పేర్లను, సెల్ నెంబర్ లను గోప్యంగా ఉంచనున్నట్లు తెలిపారు.
సి-విజిల్ యాప్ ను తమ ఫోన్ లలో ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని తమ చుట్టుపక్కల జరుగుతున్న ఎన్నికల కోడ్ ఉల్లంఘనలను అప్లోడ్ చేయాలని జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు